థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కొంటాం-డీహెచ్

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో థర్డ్ వేవ్ సైతం రానుండడంతో వైద్యారోగ్య శాఖ అధికారులు సమాయత్తమవుతున్నారు. నేడు హైకోర్టుకు నివేదిక సైతం అందించారు తెలంగాణ ప్రజారోగ్య సంచలకులు (డీహెచ్) శ్రీనివాసరావు. రాష్ట్రంలో కరోనా పరీక్షలు వేగవంతం చేస్తున్నామని, ఇప్పటి వరకూ రాష్ట్రంలో 66,79,098 మందికి వ్యాక్సిన్లు అందించామని అన్నారు.

ప్రభుత్వాస్పపత్రిలో 36.50 శాతం ప్రైవేట్ ఆస్పత్రిలో 16.35 శాతం పడకలు నిండినట్లు ఆయన తెలిపారు. ఇక రానున్న థర్డ్ వేవ్ నేపథ్యంలో పిల్లలకు కోసం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల పడకలు దీంతోపాటు హైదరాబాద్ లోని నిలోఫర్ ఆస్పత్రిలో 1000 పడకలు సిద్ధం చేసినట్లు హైకోర్టుకు పంపిన నివేదికలో తెలిపారు డీహెచ్ శ్రీనివాస్. ఇక థర్డ్ వేవ్ ను సైతం ఎదుర్కొంటామని తెలిపారు.

Share.

Comments are closed.

%d bloggers like this: