క్షమాపణలు తెలిపిన దినేష్‌ కార్తీక్

Google+ Pinterest LinkedIn Tumblr +

టీం ఇండియా స్టార్ క్రికెటర్ దినేష్‌ కార్తీక్ మహిళలకు క్షమాపణలు చెప్పాడు. గత కొన్ని రోజుల క్రితం మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయన తాజాగా వారికి క్షమాపణలు చెప్పాడు. ఇటీవల దినేష్ కార్తీక్ ఓ టెస్ట్ మ్యాచ్‌కు కామెంటరీగా వ్యవహరించిన విషయం తెలిసిందే.

అదే మ్యాచులో మహిళలను ఉద్దేశించి.. బ్యాట్‌మెన్‌కు ఎప్పుడు పక్క వాడి బ్యాట్‌ మీదనే ఇష్టం ఉంటుందని అన్నారు. బ్యాట్‌లను పక్కవాళ్ల భార్యలతో పోల్చడంతో ఈ వివాదం చెలరేగింది. ఇదే అంశంపై తాజాగా స్పందించిన ఈ స్టార్ క్రికెటర్ దీనిపై క్షమాపణలు చెబుతున్నానని, మా కుటుంబ సభ్యులు కూడా నన్ను మందలించారని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా మాత్రం చేసినవి కావు అని తెలిపాడు.

Share.

Comments are closed.

%d bloggers like this: