అమీర్‌ఖాన్ విడాకులపై కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు

Google+ Pinterest LinkedIn Tumblr +

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్ దంపతులు విడాకులు తీసుకుంటున్నామని ఓ ప్రకటన రూపంలో విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా అమిర్‌ఖాన్ అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఈ నేపథ్యంలో అమీర్‌ఖాన్ అభిమానులతో పాటుగా సినీ విశ్లేషకులు ఎవరికి వారుగా తమ భావాన్ని వ్యక్తపరుస్తున్నారు.

ఇక ఇదే దారిలో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా తనదైన శైలీలో స్పందించాడు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌, వివాదాస్పద నటీ కంగనా రనౌత్ కూడా తనదైన రీతిలో స్పందించింది. ఇక కంగనా స్పందిస్తూ…పంజాబ్‌ రాష్ట్రంలో గత కొన్ని రోజుల క్రితం కొన్నికుటుంబాలు తమకు పుట్టిన పిల్లలను ఒక కొడుకుని సిక్కులా, మరో కుమారుడిని హిందువులా పెంచేవారు.

ఇక అమీర్‌ఖాన్ మాత్రం విడాకులు రెండోసారి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారి పిల్లలు ఎందుకు ముస్లింలుగానే మిగిలిపోవాలని ప్రశ్నించింది. ఇక ఒకే కుటుంబంలో అన్ని మతాలను కలుపుకుని జీవిస్తుంటే ముస్లింలు ఎందుకు నివసించటం లేదని ప్రశ్నించింది. ఇది కాకుండా ముస్లింను పెళ్లి చేసుకునే వాళ్లు మతాన్ని కూడా ఎందుకు మార్చుకోవాలంటూ తనలోని ప్రశ్నలను బయటపెట్టింది కంగానా రనౌత్.

 

Share.

Comments are closed.

%d bloggers like this: