నారప్ప విడుదల థియేటర్లలోనే

Google+ Pinterest LinkedIn Tumblr +

విక్టరీ వెంకటేష్ హీరోగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం నారప్ప. ఈ సినిమాకు టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇందులో వెంకటేష్‌కు జోడీగా నటిస్తుంది ప్రముఖ నటి ప్రియమణి. తమిళంలో ధనుశ్ హీరోగా నిర్మితమైన ‘అసురన్’కి ఇది రీమేక్. తమిళంలో విడుదలైన ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని నమోదు చేసుకుని సరికొత్త రికార్డులను నెలకొల్పింది. కాగా గతంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మూవీని ముందుగా ఓటీటీలో రిలీజ్‌ చేద్దామని భావించారు.

దీంతో సెకండ్ వేవ్‌లో కేసుల సంఖ్య అమాంతంగా తగ్గుముఖం పడుతుండటంతో థియేటర్లు తెరుచుకునేందుకు ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో మళ్లీ దర్శక, నిర్మాతలు ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెడుతున్నారు. నారప్పను కూడా థియేటర్లలోనే విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

 

Share.

Comments are closed.

%d bloggers like this: