రూటు మార్చనున్న రాజమౌళి?

Google+ Pinterest LinkedIn Tumblr +

బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ దర్శకుడు రాజమౌళి. ఇక ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు జక్కన్న. ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌తో కలిసి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. చారీత్రక నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీపై దక్షిణాది వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక చివరి దశలో ఉన్న ఈ చిత్ర షూటింగ్ త్వరలో ముగియనుంది. ఈ సినిమా తర్వత రాజమౌళి చేయబోయే మూవీపై టాలీవుడ్‌లో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ హాలీవుడ్ రేంజ్‌లో సినిమా చేయటానికి రాజమౌళి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

ఎక్కువగా చారీత్రక నేపథ్యం ఉన్న సినిమాలే తీసే రాజమౌళి ఈ సారి ఎలాంటి సినిమాలు చేయబోతున్నారంటూ ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి అందరు అనుకున్నట్లుగానే మహేష్ బాబుతో హాలీవుడ్‌ రేంజ్‌ సినిమా తీయనున్నాడనే ప్రశ్నకు సమాధానం కావాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఆగాల్సిందే.

Share.

Comments are closed.

%d bloggers like this: