కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసిన సంతోష్ కుమార్ గంగ్వార్

Google+ Pinterest LinkedIn Tumblr +

కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు సంతోష్ కుమార్ గంగ్వార్. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి గా ఉన్న ఆయన నేడు ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇక ఈయనతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న రమేష్ ప్రోఖ్రియాల్ కూడా రాజీనామా చేశారు విశేషం. ఏ సమయమైన మంత్రి వర్గవిస్తరణపై కొత్తవారి పేర్లతో కూడిన ప్రకటన రావచ్చని సమాచారం.

మంత్రివర్గ విస్తరణ అంశంపై మోడీ సర్కార్ ఎన్నో రోజుల నుంచి నాన్చుతున్న మంత్రివర్గ విస్తరణపై ఎట్టకేలకు నేడు లేదా రేపు ప్రకటన వచ్చే విధంగా సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తవారిని 20 మందికి పైగా తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది 5 రాష్ట్రాల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రాలకు మంత్రివర్గంలో సముచిత స్థానం కల్పించవచ్చని జాతీయ రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

Share.

Comments are closed.

%d bloggers like this: