రాజకీయ ఎంట్రీపై స్పందించిన కేసీఆర్ మనవడు

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు రాజకీయాల్లో ఓ కుటుంబం రాజకీయాల్లో కొనసాగుతుందంటే వారి కొడుకులు, కూతుళ్లు రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. వైఎస్సార్ రాజకీయాల్లోకి అడుగుపెట్టడంతో ఆయనతో పాటుగా జగన్‌ కూడా రాజకీయ అరంగేట్రం చేశాడు. వైఎస్సార్ మరణించకన్నా ముందు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నప్పటికీ అంతాగా కనిపించలేదనే చెప్పాలి. ఆయన తండ్రి మరణించడం, ఓదార్పు యాత్ర వంటి తదనంతర పరిణామాల మధ్య జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.

ఇలా ప్రతీ రాజకీయ కుటుంబం వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. అదే దారిలో కొనసాగుతుంది కల్వకుంట్ల కుటుంబం. కేసీఆర్ తో పాటు చాలా కాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు కేటీఆర్, కవిత. ఇక వీళ్లతో పాటు వీరి కుమారులు కూడా రాజకీయాల్లోకే వస్తారని అందరూ అనుకుంటున్నారు. ఇక ఇదే అంశంపై ట్విట్టర్‌ వేదికగా స్పందించాడు కేటీఆర్ కొడుకు, కేసీఆర్ మనవడు హిమాన్షు. ట్విట్టర్‌లో స్పందిస్తూ..నాకు రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి లేదని, వేరే లక్ష్యాలు ఉన్నాయని తెలిపారు హిమాన్షు. దీంతో కేసీఆర్ రాజకీయ కుటుంబం కేటీఆర్‌తోనే అంతమైపోతుందని స్పష్టంగా అర్ధమవుతోంది.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: