కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి

Google+ Pinterest LinkedIn Tumblr +

బీజేపీలో ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతూ ప్రజలకు సేవ చేస్తూ తెలంగాణ రాజకీయాల్లో ఓ వెలుగు వెలుగుతున్నారు కిషన్ రెడ్డి. ప్రస్తుతం కేంద్రహోంశాఖ సహాయమంత్రిగా కొనసాగుతున్న ఆయనకు మోడీ సర్కార్ ఏకంగా కేంద్రమంత్రి పదవిని కట్టబెడుతూ సత్కరించింది. నేడు ఢిల్లీలో జరిగిన ప్రమాణస్వీకారంలో రాష్టప్రతి ఆయనను కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు.

విద్యార్థి దశ నుంచే రాజకీయ మెలుకువలు నేర్చుకున్న ఆయన నేడు కేంద్రమంత్రిగా ఎదిగారు. ఇక కిషన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామంలో 1960 లో ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. ఇక కార్యకర్త నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రత్యక్ష రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. విద్యార్థిగా చదువుతునే రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకున్నారు కిషన్ రెడ్డి. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2019 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి 45 వేలకుపైగా ఓట్లతో ఎంపీగా విజయడంఖా మోగించారు. అలా రాజకీయాల్లో ఒక్కొక్కమెట్టు ఎక్కుతు భవిష్యత్‌ తరాల రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: