అమీర్ ఖాన్ ఫాతిమాసన కి మధ్య సంబంధం ఇదేనా?

Google+ Pinterest LinkedIn Tumblr +

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కు ఓ యంగ్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ కు సంబందం ఉందని మీడియాలో ఓ వార్త ఈ మద్య హల్ చల్ చేస్తుంది..ఆ వార్త పై ఫాతిమా తీవ్రంగా స్పంధించింది.. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తో తనకు స్నేహానికి మించిన సంబంధం ఉందంటూ మీడియాలో వస్తున్న వార్తలపై బాలీవుడ్ నటి ఫాతిమా సనా షేక్ మండిపడ్డారు. తప్పుడు వార్తలు రాసి, ప్రశాంతంగా ఎలా నిద్రపోగలుగుతున్నారని ఆమె ప్రశ్నించింది. ఈ వార్తలు చాలా అసహ్యంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేసింది.

అమీర్ తో తనకు లింక్స్ ఉన్నాయనే వార్తను ఓ టీవీ చానెల్ లో ప్రసారం చేశారని… ఆ వార్తను చూసి తాను, అమ్మ ఇద్దరం చాలా బాధ పడ్డామని తెలిపింది. ఇలాంటి నిందలను చెరిపివేసుకునే బాధ్యత తమపైనే ఉంటుందని చెప్పింది. పబ్లిసిటికోసమో మరే ఇతర ఫేమ్ కోసమో తమ పై ఇలాంటి తప్పుడు వార్తలు రాయడం సరికాదని అంటుంది..
నిజంగా ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తే కోపంవచ్చి వార్త రాసిన వారిపై దాడి చేస్తామని… లేకపోతే సదరు వార్తపై క్లారిటీ ఇస్తాము. ఇది చాల కామన్ …. తనకైతే ఈ తప్పుడు వార్తలపై స్పందించాల్సిన అవసరం లేదనిపిస్తోందని చెప్పుకొచ్చింది ఈ చిన్నది..
అమీర్ ఖన్ తో తనకున్నది స్నేహం మాత్రమే అంటున్న ఫాతిమ అమీర్, ఫాతిమా పై తప్పుడు వార్తలు త్రివ్రంగా స్పంధించిన చిన్నది ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదంటున్న ఫాతిమ.

Share.

Leave A Reply

%d bloggers like this: