టీఆర్‌ఎస్‌లో పదవులకోసం నేతలు పడిగాపులు పదవులు లిస్ట్ చూస్తే మూరడంత..

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో పదవులకోసం నేతలు పడిగాపులు కాస్తున్నారు. పదవులు లీస్ట్ చూస్తే మూరడంత పదవులు ఆశిస్తున్న నేతల లీస్ట్ చేంతాడంత మరి కొద్దీరోజుల్లో ముగియనున్న 15మంది ఏమ్మెల్సీ ల పదవికాలం చాలా మందినేతలకు మళ్ళీ ఏమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశం కనబడుతోంది ఆ మిగిలిన ఏమ్మెల్సీ పదవుల కోసం తీవ్రమైన పోటీ ఆ పదవి కూడా దక్కని వారికి ఏదైనా కార్పొరేషన్ పదవి ఇవ్వాలని చూస్తుంది టిఆర్ఏస్ అందుకే గతంలో టిఆర్ఏస్ పార్టీ నియమించిన పార్లమెంట్ కార్యదర్శులను అనేక రాష్ర్టాలలో పార్లమెంట్ కార్యదర్శుల నియామాకాన్ని పరిశీలించిన టిఆర్ఏస్ నేతలు. మంత్రి పదవులు రానివారందరికీ ఏక్కడో అక్కడ ఏదో ఓక పదవి కట్టబెట్టక తప్పదు మేమెప్పుడు ఏదిగేది అని పార్టీ సీనియర్లను ప్రశ్నిస్తున్నారట మొత్తానికి ఇతర పార్టీల నేతలనయితే తమ పార్టీ లో చేర్చుకున్నారు.

టిఆర్ఏస్ నేతలు పదవుల కోసం పడిగాపులు కాస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్దులుగా అవకాశం రానివారందరు నామినేటెడ్ పదవులు వస్తాయని ఎదురు చూస్తున్నారు. కొద్ది రోజుల్లో కొంత మంది ఏమ్మెల్సీల పదవికాలం ముగియనుండడంతో ఆ కోటా పదవికోసం చాలామంది నేతలే పోటీ పడుతున్నారు. సీనియర్, జూనియర్ అనే తేడాలేకుండా పదవులకోసం పోటీ పడుతున్న నేతలకు పదవులు ఎప్పుడు దక్కనున్నాయి.

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో పదవులకోసం నేతలు పడిగాపులు కాస్తున్నారు. ఏమ్మేల్యేలుగా అవకాశం రాని వారందరికీ ఏమ్మెల్సీ, నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు పార్టీ పెద్దలు. కానీ పదవులు లీస్ట్ చూస్తే మూరడంత లిస్ట్ ఉంది. కానీ పదవులు ఆశిస్తున్న నేతల లీస్ట్ చూస్తే చేంతాడంత ఉంది. దీంతో ఈ పదవుల భర్తీలో టిఆర్ఏస్ అధినాయకత్వానికి తలనొప్పి తప్పేట్లు లేదు. మరి కొద్దీ రోజుల్లో దాదాపు 15మంది ఏమ్మెల్సీ ల పదవికాలం ముగియనుంది. ఇందులో చాలామంది అధికార పార్టీ కి చెందినవారే ఉండగా వారిలో చాలా మందినేతలకు మళ్ళీ ఏమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశం కనబడుతోంది… నాలుగైదు ఏమ్మెల్సీ లు మినహా మిగతా ఏమ్మెల్సీలందరికి మరొకసారి ఏమ్మెల్సీ గా అవకాశం కల్పించాలని అనుకుంటున్నారు పార్టీ నేతలు.

ఆ మిగిలిన ఏమ్మెల్సీ పదవుల కోసం నేతలనుండి పోటీ విపరీతంగా ఉంది. ఏమ్మేల్యేలుగా ఓడిపోయిన అభ్యర్దులు‌ ,ఏమ్మేల్యేలుగా అవకాశం రాని నేతలు ,పార్టీ కోసం పనిచేస్తున్న నేతలు ఈ పదవుల కోసం పోటీ పడుతున్నారు…ఏమ్మెల్సీ అవకాశం దక్కని వారికి పార్లమెంట్ కార్యదర్శులుగా …ఆ పదవి కూడా దక్కని వారికి ఏదైనా కార్పొరేషన్ పదవి ఇవ్వాలని చూస్తుంది టిఆర్ఏస్… ఆలస్యమయ్యేకొద్ది పార్టీ నేతల్లో అసంతృప్తి పెరిగే అవకాశం ఉందని భావించిన పార్టీ అధినాయకత్వం తొందరలోనే నామినేటెడ్ పదవుల భర్తి చేస్తామని.. .అందరికీ అవకాశం కల్పిస్తామని …నేతలకు సర్ది చెపుతున్నారట పార్టీ అధినాకత్వం…ఇతర పార్టీ ల నుంచి వచ్చిన నేతలు ఏక్కువ మంది కావడంతో …పదవుల కోసం పోటీ భాగ పెరిగిందంటుంన్నారు. తెలంగాణ భవన్ వర్గాలు…

సాధ్యమయినన్ని ఏక్కువ పదవులు సృష్టించి అందరినీ సంతృప్తి పరచాలని చూస్తుంది టిఆర్ఏస్ అధినాకత్వం…అందుకే గతంలో టిఆర్ఏస్ పార్టీ నియమించిన పార్లమెంట్ కార్దర్శులను ….హైకోర్టు తప్ప బట్టినా…మళ్ళీ పార్లమెంట్ కార్దర్శులను నియమించేందుకు సన్నాహాలు చేస్తోంది టిఆర్ఏస్… అనేక రాష్ర్టాలలో పార్లమెంట్ కార్యదర్శుల నియామాకాన్ని పరిశీలించిన టిఆర్ఏస్ నేతలు…దానికి అనుగుణంగా ఈ సారి ఏలాంటి ఇబ్బందులు రాకుండా పార్లమెంట్ కార్యదర్శులను నియమిస్తామంటుంన్నారు టిఆర్ఏస్ నేతలు…ఇలా అన్ని రకాలుగా అవకాశం ఉన్న అన్ని స్థానాల్లో పార్టీ నేతలను అకామిడేట్ చేసే ప్రయత్నం లో ఉంది టిఆర్ఏస్…

ఇక చాలామంది నేతలు మంత్రి పదవుల మీద ఆశలు పెట్టుకున్నారు… మంత్రి పదవులు రానివారందరికీ ఏక్కడో అక్కడ ఏదో ఓక పదవి కట్టబెట్టక తప్పదు…దీంతో సెకండ్ స్టేజ్ క్యాడర్ పార్టీ పై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.. అన్ని పదవులు వాళ్ళకే కేటాయిస్తే…మేమెప్పుడు ఏదిగేది అని పార్టీ సీనియర్లను ప్రశ్నిస్తున్నారట…దీంతో సీనియర్ నేతలును ఏలా అకామిడేట్ చేయాలో తెలియక ..కొత్త వారికి ఏలా అవకాశం ఇవ్వాలో అర్దం కాక టిఆర్ఏస్ నేతలు తలలు పట్టుకుంటుంన్నారట.. మొత్తానికి ఇతర పార్టీల నేతలనయితే తమ పార్టీ లో చేర్చుకున్నారు కానీ వారందరిని ఏలా అకామిడేట్ చేయాలో టిఆర్ఏస్ పెద్దలకు అర్దం కావట్లేదు. నేతలు మాత్రం తమకు కావలసిన పదవులకోసం కర్చిఫ్ వేసి కూర్చున్నారు.. మరి ఇందులో పదవి దక్కేదెవరికో…దక్కని దెవరికో…చూడాలి మరి…

Share.

Leave A Reply

%d bloggers like this: