బాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేందుకు సిద్దమవుతున్న ఫ్లోరాసైనీ

Google+ Pinterest LinkedIn Tumblr +

అప్పుడెప్పుడో తెలుగువారిని కవ్వించిన ఆశాసైనీ… అదేనండి మన లక్స్ పాప… బాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేందుకు సిద్ధమైంది. రెండో లెవెల్ లో అమ్మడు గ్లామర్ డోస్ కూడా బాగానే పెంచుతోందట. ఆ ముచ్చటేంటో ఇప్పుడు చూద్దాం.
లక్స్ పాప అన్న పాట వినిపిస్తే చాలు… ఆశాసైనీ అందాలు కళ్లముందు కదలుతాయి. చేసినవి కొన్ని సినిమాలే అయినా… చెప్పుకోదగ్గ విధంగానే గుర్తింపు పొందిన ఆశా…. బాలీవుడ్ మోజులో పడి దాదాపూ ఫేడ్ అవుట్ అయిపోయింది. అక్కడికి వెళ్లాక ఫ్లోరా షైనీగా మారిన మన లక్స్ పాప… ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కు సిద్ధమవుతోందట.
సినిమాల్లో ఆఫర్లు దక్కించుకోలేకపోతున్న ఫ్లోరా…. వెబ్ సిరీస్ పై దృష్టి సారించింది. ఇక అక్కడ జాక్ పాట్ లాంటి ఆఫర్ ను పట్టేసిందనే చెప్పుకోవాలి. బాలీవుడ్ సుప్రసిద్ధ నిర్మాత ఏక్తా కపూర్ నిర్మిస్తున్న వెబ్ సిరీస్ గందీ బాత్ 2లో ఫ్లోరా కీలకమైన పాత్ర పోషిస్తోందట. ఈ సిరీస్ లో అమ్మడు గ్లామర్ డోస్ అమాంతం పెంచబోతోందట. ఆ విషయాన్ని అమ్మడే స్వయంగా చెబుతోంది.
గందీ బాత్ తొలి సీజన్… ఓ రకంగా సంచలనం సృష్టించిందనే చెప్పుకోవాలి. అభ్యంతరకరమైన మాటలు, మితిమీరిన శృంగారంతో నిండిన ఈ సిరీస్ సీజన్ 2 అంతకు మించి ఉండబోతోందట. ఇక ఇందులో నటిస్తోన్న ఫ్లోరా… ఓ హాట్ పనిమనిషిగా నటిస్తోందట. అంతేకాదు… కొన్ని సన్నివేశాల్లో పూర్తి న్యూడ్ గానూ కనిపించబోతోందట. మరి… ముదురు వయసులో అమ్మడి గ్లామర్ ట్రీట్ ఏ విధంగా ఉంటుందో చూడాలి.
లేటు వయసులో లక్స్ పాప అందాల విందు వెబ్ సిరీస్ లో సూపర్ హాట్ గా కనిపించనున్న ఫ్లోరా షైనీ గందీ బాత్ 2లో పనిమనిషిగా నటిస్తున్న లక్స్ పాప కొన్ని సన్నివేశాల్లో న్యూడ్ గా కనిపించనున్న ఫ్లోరా.

Share.

Leave A Reply

%d bloggers like this: