Confusion about Paritala Sriram Entry?

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగుదేశం పార్టీలో నందమూరి, నారా కుటుంబాల తర్వాత ఆ స్థాయిలో తెలుగుదేశం కార్యకర్తలు అభిమానించేవారు ఎవరైనా ఉన్నారంటే అది పరిటాల ఫ్యామిలీని మాత్రమే. తనదైన దూకుడుతో అభిమానులను సంపాధించుకున్న పరిటాల రవి చనిపోయిన తర్వాత.. రాజకీయంగా ఆయన బాధ్యతలను భూజాన మోసింది భార్య పరిటాల సునీత. అయితే ఇప్పుడు పరిటాల వారసుడు పరిటాల శ్రీరామ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమయ్యాడా?

అభిమానులను సాధించుకున్న కుటుంబం పరిటాల రవీంద్రదే. తనదైన దూకుడుతో రవి చాలా అంన్డి అభిమానులను సంపాదించుకున్నారు. ఆ తర్వాత కొందరు తీసిన దొంగదెబ్బ వల్ల ఆకస్మిక మరణం పొందారు రవి. ఆ తర్వాత ఆయన వర్గానికి భరోసాగా నిలబడటానికి ఆయన భార్య పరిటాల సునీత పొలిటికల్ ఎంట్రీ ఇవ్వటం, తాజా కాబినెట్ లో మంత్రి కావటం వెంటవెంటనే జరిగిపోయాయి. ఇప్పుడు రవి వారసుడు గా శ్రీరామ్ ఎంట్రీ పై రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పరిటాల సునీత కీలక వ్యాఖ్యలు చేసారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీకి త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులపై ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు నిర్ణయమే తమకు శిరోధార్యమని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు. సింహాచల వరాహలక్ష్మీనృసింహస్వామిని ఆదివారం ఆమె దర్శించుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగా రాష్ట్రంలో కూడా కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తుపై ఉంటుందా అని అడగగా, ఎన్నికలకు మరికొంత సమయం ఉందని, ఎన్నికల విషయంలో తమ అధినేత, సీఎం తగిన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. అదే విధంగా పరిటాల శ్రీరామ్‌ రాజకీయ అరంగేట్రం 2019 ఎన్నికల్లో జరుగుతుందా అన్న ప్రశ్నకు బదులిస్తూ…మా కుటుంబానికి అండగా నిలిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల్లో శ్రీరామ్‌ భవిత నిర్ణయించబడుతుందన్నారు. తన శాఖలో అమలు జరుగుతున్న అన్నఅమృతహస్తం, బాలామృతం, బాల సంజీవని పథకాలు బాలింతలకు ఎంతో మేలు చేస్తున్నాయన్నారు. వాటిని దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న గర్భిణులకు, బాలింతలకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అమలు చేస్తున్నామన్నారు.

అనంతపురం జిల్లా నుండి పరిటాల శ్రీరామ్‌ను ఎన్నికల్లో పోటీ చేసే విషయమై టీడీపీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. గత ఎన్నికల సమయంలో పరిటాల శ్రీరామ్‌కు పోటీ చేసేందుకు వయస్సు సరిపోదని భావించారు. అయితే ఈ నాలుగేళ్ల కాలంలో శ్రీరామ్ కూడ రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.ఈ దఫానైనా పరిటాల శ్రీరామ్‌ ఎన్నికల్లో పోటీ చేస్తారా అనే విషయమై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు నిర్వహించిన వస్తున్నా మీ కోసం పాదయాత్ర అనంతపురం జిల్లాలోనే ,ప్రారంభమైంది.ఈ పాదయాత్రలో శ్రీరామ్ చురకుగా పాల్గొన్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో పరిటాల సునీత మరోసారి విజయం సాధించారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో సునీత చంద్రబాబునాయుడు కేబినెట్‌లో మంత్రిగా కూడ పనిచేస్తున్నారు.

అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబానికి మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో ఈ దఫా పరిటాల శ్రీరామ్‌ను ఎన్నికల బరిలోకి దింపుతారనే ప్రచారం కూడ లేకపోలేదు. ప్రస్తుతం సునీత రాప్తాడు నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఒకవేళ సునీత వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటే ఈ స్థానం నుండి పరిటాల శ్రీరామ్ ను బరిలోకి దింపే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.

పరిటాల సునీత పోటీకి ఆసక్తిగా లేకపోతే శ్రీరామ్‌ను బరిలోకి దింపే అవకాశం ఉందని సమాచారం. పరిటాల శ్రీరామ్ ఎన్నికల్లో పోటీ చేసే విషయమై మంత్రి సునీత కూడ నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు. శ్రీరామ్ రాజకీయ భవితవ్యం చంద్రబాబునాయుడు చేతుల్లో పెట్టినట్టుగా ఆమె ప్రకటించారు.

ఈ నాలుగేళ్ల కాలంలో రాప్తాడు నియోజకవర్గంతో పాటు టీడీపీ కార్యక్రమాల్లో పరిటాల శ్రీరామ్ చురుకుగా పాల్గొంటున్నారు. ఇటీవల జరిగిన రాప్తాడు నియోజకవర్గంలో జరిగిన బీసీ సదస్సులో పరిటాల శ్రీరామ్ చేసిన ప్రసంగం ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసింది.ప్రత్యర్థి పార్టీని ప్రస్తావించకుండానే శ్రీరామ్ ఘాటైన విమర్శలు చేశారు.

పార్టీ నాయకత్వం అంగీకరిస్తే ఈ దఫా ఎన్నికల్లో శ్రీరామ్‌ను బరిలోకి దింపేందుకు కుటుంబం సంసిద్దంగా ఉందని చెబుతున్నారు. అయితే శ్రీరామ్‌ పోటీకి చంద్రబాబునాయుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని కూడ పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. ఈ విషయమై స్పష్టత రావాలంటే మరో నెల రోజులు వేచి చూడాల్సిందే.

Share.

Comments are closed.

%d bloggers like this: