వైసీపీకి తలనొప్పిగా సీనియర్ నేత.. సస్పెండ్ చేస్తారా?

Google+ Pinterest LinkedIn Tumblr +

బెజవాడ రాజకీయాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓ నేత తలనొప్పిగా మారారా? రోజుకో వివాదంతో పార్టీని ఇబ్బందిపెడుతున్న ఆ నేతను జగన్ చూసి చూడనట్లు ఎందుకు వదిలేస్తున్నారు..? బంధుత్వం కారణంగానే జగన్ అతనిని బరించక తప్పదని లైట్ తీసుకుంటున్నారా..? అయితే తాజాగా ఆ నేత ముస్లీంలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ తీసుకోబోతున్న నిర్ణయం ఏంటి?


“వంగవీటి రంగా పాములాంటోడు.. ఆయనను చంపితే తప్పేముందంటూ..” ఓ టీవీ చానల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. ఓ సందర్భంలో రాజకీయ వేడి పుట్టించిన వైసీపీ కార్మిక విభాగం అధ్యక్షుడు గౌతంరెడ్డి.. మరోసారి తన టంగ్ పవర్ చూపించారు. ” పాలిచ్చే ఆవును వాడుకుని వదిలేసినట్టు ముస్లింలు తమ భార్యలను వాడుకుని వదిలేస్తారు..” అంటూ ట్రిపుల్ తలాఖ్‌పై.. ఓ టీవీ చానల్‌లో జరిగిన చర్చ కార్యక్రమంలో గౌతంరెడ్డి మాట్లాడిన మాటలు ఇప్పుడు రాజకీయంగా తీవ్ర వివాదాన్ని సష్టిస్తున్నాయి. కార్యక్రమంలో పాల్గొన్న గౌతం రెడ్డి.. తన అభిప్రాయాన్ని చాలా విశాలంగా.. ప్రజల ముందు ఉంచారు. దీంతో ఇప్పుడు గౌతమ్ రెడ్డిపై ముస్లీంలు.. పలు ప్రజీ సంఘాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

విజయవాడలో వంగవీటి రాధా గౌతమ్ రెడ్డి మధ్యన కూడా విబేధాలు ఉన్నాయి. వంగవీటి రంగా మీద గౌతమ్ రెడ్డి గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు నేతలు ప్రకటించారు. అయితే కొన్ని రోజుల తర్వాత విజయవాడలో జగన్ ప్రజాసంకల్ప యాత్రలో గౌతమ్ రెడ్డి వైసీపీ అధినేత వెంట కనిపించడంతో ఆయన పార్టీలోనే ఉన్నట్లు అర్థమైంది. మామలుగా అయితే ముస్లీంలపై వ్యాఖ్యలు వ్యక్తిగత అభిప్రాయం అయ్యేదేమో కానీ.. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఆ చర్చలో పాల్గొన్నారు. దీంతో గౌతం రెడ్డి మాటలు ముస్లింల మనోభావాలను దెబ్బతీశాయి. కొన్ని ముస్లిం సంస్థలు.. గౌతం రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. ఇస్లాం ధర్మం గురించి తెలియకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించబోమని ఆయనపై వైసీపీ తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

ముస్లింల ఆగ్రహం పెరుగుతుండటంతో.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి… కాస్త ఆలస్యంగానైనా స్పందించారు. ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయకూడదో చెప్పాలంటూ.. ఓ షోకాజ్ నోటీస్ జారీ చేశారు. నిజానికి వంగవీటి రంగాపై అభ్యంతరక వ్యాఖ్యలు చేసినప్పుడు .. టీవీలో ప్రచారమై.. దుమారం రేగినప్పుడు కూడా.. జగన్ పట్టించుకోలేదు. అదో కార్చిచ్చులా మారే ప్రమాదం ఏర్పడటంతో చివరికి…సస్పెండ్ చేశారు. కానీ అదంతా ఉత్త పేరుకే. ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. వంగవీటి రాధాకృష్ణ అయితే.. ఆయనను పార్టీ నుంచి తొలగించాల్సిందేనని డిమాండ్ చేశారు. కానీ చివరికి.. గౌతంరెడ్డిపై.. తూతూ మంత్రంగా వేసిన సస్పెన్షన్‌ను ఎత్తి వేసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేలా చేశారు. అందువల్లే వంగవీటి రాధాకృష్ణ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నట్లు చెప్తుంటారు.

గౌతంరెడ్డి గత ఎన్నికల్లో వైసీపీ నుంచి సెంట్రల్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బంధువు. ఆ కారణంగానే.. ఆయన తన టంగ్ పవర్‌ని చూపిస్తూంటారని చెబుతూంటారు. ఈసారి ఎన్నికల్లో టిక్కెట్ రేసులో ఆయన లేరు. తను అటు వంగవీటి రాంగాపైన.. ఇటు ముస్లింలపైనా ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయడానికి ఇది కూడా ఓ కారణమే. ఆయనకు పెద్దగా అనుచరగణం లేకపోయినా.. బంధువన్న కారణంగా వైసీపీ భరించాల్సి వస్తోంది. షోకాజ్ నోటీసులిచ్చి ఎప్పటికప్పుడు.. కవర్ చేసుకోవాల్సి వస్తోంది. అయితే ఇప్పుడు మాత్రం.. గౌతమ్ రెడ్డి వ్యాఖ్యలు ముస్లీం ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో సస్పెన్షన్‌ వేటు వేసేందుకు పార్టీ అధిష్ఠానం సిద్ధమవుతోంది.

Share.

Comments are closed.

%d bloggers like this: