పరిటాల సునీతపై తిరుగుబాటు..?

Google+ Pinterest LinkedIn Tumblr +

రాప్తాడు నియోజకవర్గంలో మంత్రి పరిటాల సునీత కుటుంబ పాలన సాగిస్తున్నారంటూ పరిటాల రవి ముఖ్య అనుచరుడు వేపకుంట రాజన్న ఆరోపించారు. సునీత వైఖరితో పాటు చంద్రబాబు పాలనలో పేదలకు న్యాయం జరగడం లేదని, అందుకే నాలుగేళ్లుగా టీడీపీకి దూరంగా ఉంటున్నానని ఆయన తెలిపారు. తన స్వగ్రామం తల్లిమడుగులలో తన అనుచరులు, పలువురు టీడీపీ నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆనాడు నిరుపేదలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే పరిటాల రవితో కలిసి భూస్వామ్య పోరాటాలు చేశానన్నారు. రవి మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన ఆయన భార్య సునీత.. భర్త ఆశయాలను పక్కన పెట్టి కుటుంబ రాజకీయాలకు తెరలేపారని ఆరోపించారు. రాప్తాడు నియోజకవర్గంలో సునీత కుటుంబసభ్యులు, బంధువులకు తప్ప పేద, బడుగు వర్గాలకు న్యాయం జరగడం లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు. ఇక సునీతతో వేగలేమని.. అందరూ కలిసి టీడీపీ నుంచి బయటకు వెళ్లిపోదామని రాజన్న పిలుపునిచ్చారు.

పేదల పక్షాన నిలిచే పార్టీకే తన మద్దతు ఉంటుందని ప్రకటించిన రాజన్న.. త్వరలోనే జగన్ సమక్షంలో వైసీపీలో చేరబోతున్నట్టు ప్రకటించారు… కాగా, సునీతతో పాటు సీఎం చంద్రబాబుపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ నేతలు రాజన్నపై మండిపడుతున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: