కియా కార్లు షురూ…!

Google+ Pinterest LinkedIn Tumblr +

పారిశ్రామిక రంగంలో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ లో కియా మోటార్స్ అనే కార్ల సంస్థ ఏర్పాటైంది. దక్షిణ కొరియాకు చెందిన ప్రతిష్ఠాత్మక హ్యుందాయ్ అనుబంధ సంస్థ కియా మోటార్స్ ఆంధ్ర ప్రదేశ్ పెనుగొండ లో తమ ప్లాంట్ ని ఆరంభించింది. ఈ సంస్థ ఆవిష్కరణకి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పెనుగొండ సమీపంలో 650 ఎకరాల స్థలాన్ని ఇవ్వగా కియా మోటార్స్ సంస్థ 13,500 కోట్ల పెట్టుబడితో సంస్థ కార్ల తయారీ ప్లాంట్ ని ఆరంభించింది .ఈ ప్లాంట్‌లో ఏడాదికి 3లక్షల కార్లు తయారుచేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఇక్కడ తయారైన తొలి మేడిన్ ఆంధ్రా కారును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు.

కియా కారును ఆవిష్కరించిన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ… ఏపీని ఆటోమొబైల్ హబ్‌గా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యంలో కియా మోటార్స్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. అతి తక్కువ సమయంలోనే తొలి కారును రూపొందించినందుకు కియా సంస్థను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. కరువు సీమగా ఉన్న రాయలసీమ కియా రాకతో రతనాల సీమగా మారుతోందన్నారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా తీర్చిదిద్దాలన్న సంకల్పతంతోనే ఎన్నో ప్రయత్నాలు చేసి కియా సంస్థను రాష్ట్రానికి తీసుకొచ్చామన్నారు.

రాష్ట్రంలో కరవుకు ప్రతిరూపంగా పేరుగాంచిన అనంతపురం జిల్లా ఇకపై కార్ల తయారీ కేంద్రంగా ఖ్యాతిగాంచనుంది.. ఈ సంస్థ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా కలిపి 11 వేల మందికి ఉపాధి లభించనుంది. ఈ ప్లాంట్‌లో గంటకు 50 సగటుతో ఏడాదికి 3 లక్షల కార్లు తయారవుతాయి. కియా సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా 14 ఉత్పత్తి కేంద్రాలు ఉండగా, ఇది 15వది. ఈ సంస్థ భూములకు అన్వేషిస్తుండగా పొరుగునే ఉన్న కర్ణాటక, తమిళనాడుతో పాటు, మహారాష్ట్ర, ఉత్తర్‌ ప్రదేశ్‌, గుజరాత్‌ వంటి రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా కియాను తమ రాష్ట్రానికి తీసుకెళ్లేందుకు విశ్వప్రయత్నాలు చేశాయి.కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని సంస్థ ని అనంతపురానికి తీసుకొని వచ్చారు.

Share.

Comments are closed.

%d bloggers like this: