చంద్రబాబు ఒక ఎక్స్‌పైర్ అయిన ట్యాబ్లెట్

Google+ Pinterest LinkedIn Tumblr +

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజమండ్రిలో నిర్వహించిన మహిళా స్వరం కార్యక్రమంలో నగిరి ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు. కంబాల చెరువు నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహించి రోజా స్వయంగా బైక్‌ నడుపుతూ కార్యకర్తలను ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు పై మాటల తుటాలు పేల్చారు పంచ్ డైలాగ్స్ తో సభాను ఉత్తేజపరిచారు.
రోజా మాట్లాడుతూ ‘చంద్రబాబు ఒక ఎక్స్‌పైర్ అయిన ట్యాబ్లెట్ అని.. వేసుకోవడం వల్ల ఉపయోగం ఉండదని, వేసుకున్న వారికే నష్టం అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో లోకేష్‌కి తప్ప ఎవరికీ ఉద్యోగం రాలేదని.. చంద్రబాబు తన కోడలు బ్రాహ్మణిని మాత్రమే పారిశ్రామికవేత్తగా మార్చారని రోజా విమర్శించారు. డ్వాక్రా మహిళలను అప్పులపాలు చేసిన చంద్రబాబుకు అసలు పసుపు కుంకుమల విలువ తెలియదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడవారి కష్టాలు తీర్చగల నాయకుడు కేవలం జగన్ ఒక్కడేనని, అమ్మ ఒడి పథకం ద్వారా ప్రతీ మహిళను జగన్ ఆదుకుంటారని తెలిపారు.తన మాటలతో పంచ్ డైలాగ్స్ తో రోజా సభని అదరగొట్టారు.

Share.

Comments are closed.

%d bloggers like this: