అమెరికా అధ్యక్షత భరిలో భారత తొలి మహిళ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మన దేశం లోనే కాకుండా భారతీయులు అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో తమ సత్తా చాటుతున్నారు.. నాసా లాంటి అంతరిక్ష కేంద్రంలో 33 శాతం భారతీయులు ఉండటం అంటే మామూలు కాదు సుమా..! వైధ్య, విధ్య, వానిధ్య రంగాల్లోనే కాకుండా ఇప్పుడు రాజకీయాల్లోనూ చురుగ్గా తమ ఉనికిని చాటుకుంటున్నారు. ఇప్పటికే అమెరికా కెనెడా లాంటి అగ్ర దేశాల్లో మన భారతీయులు మంత్రులుగా ఉన్నారు. ఇదే తరహా లో అమెరికా 2020 అధ్యక్ష ఎన్నికల్లో తాను ట్రంప్ పై పోటీ చేస్తానని భారతీయ మూలాలున్న తొలి సెనేటర్ కమలా హ్యారిస్ ప్రకటించారు.

కమల కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఓక్లాండ్‌లో జన్మించారు. కమల తండ్రి డోనల్డ్‌ హ్యారిస్‌ది జమైకా కాగా, తల్లి శ్యామలా గోపాలన్‌ది చెన్నై. అమెరికాలో జాతివివక్షపై ఉద్యమించిన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గౌరవార్థం ఏటా జనవరిలో మూడో సోమవారం ఎంఎల్‌కే డేను జరుపుకుంటారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై ప్రకటన చేయడానికి కమల ‘మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ డే (ఎంఎల్‌కే డే)’ను ఎంచుకున్నారు. మార్టిన్ లూథర్ తనకి స్పూర్తిధాయకూడని ఈ సంధర్భంగా ప్రకటించడం సంతోషమని ఆమె వ్యక్తం చేశారు.
డెమొక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా నామినేషన్ దక్కితే, అధ్యక్ష పదవికి ఒక ప్రధాన పార్టీ తరపున పోటీపడే తొలి ఆఫ్రికన్ అమెరికన్ మహిళ, తొలి భారతీయ అమెరికన్ మహిళ కమలే అవుతారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడి విజయం సాధిస్తే ఈ పదవిని చేపట్టే తొలి మహిళ ఆమే అవుతారు.

Share.

Comments are closed.

%d bloggers like this: