మోడీ పై బాబు విమర్శలు..

Google+ Pinterest LinkedIn Tumblr +

ఏపి సిఎం చంద్రబాబు మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడిపై విమర్శలు చేశారు. మోడి రాజకీయాల్లో తనకన్నా జూనియర్‌ అయినా కూడా నేను ఆయని సర్‌ అని పిలిచానని, అప్పట్లో అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ను సైతం నేను మిస్టర్‌ క్లింటన్‌ అని పిలిచాను తప్ప సర్‌ అనలేదు, కానీ రాష్ట్రం కోసం ఆయన అహాన్ని సంతృప్తి పరచడం కోసం నేను మోడిని సర్‌ అని పిలిచాను. గుజరాత్ అల్లర్ల సమయంలో మోదీ దిగిపోవాలని మొట్టమొదట డిమాండ్ చేసింది తానేనని, అది దృష్టిలో ఉంచుకొనే ఇప్పుడు ఏపీపై కక్ష సాధిస్తున్నారని బాబు ఆరోపించారు..

రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను కూడా సరిగ్గా ఇవ్వకుండా… తమపై బీజేపీ దాడి చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. బీజేపీతో కలసి వైసీపీ, టీఆర్ఎస్ లు కుమ్మక్కు రాజకీయాలను చేస్తున్నాయని విమర్శించారు. ఓవైపు కేసీఆర్, మరోవైపు జగన్ ఇద్దరూ కలసి ఏపీకి అన్యాయం చేస్తున్నారని అన్నారు. అసలు మోదీ తీరు సరిగా లేకపోవడం వల్లే సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే మళ్లీ నిరాహార దీక్ష చేసే పరిస్థితి వచ్చిందని తెలిపారు. మోదీ నిరంకుశ వైఖరి నచ్చక జాతీయ గణాంకాల కమిషన్ లో ఇద్దరు సభ్యులు రాజీనామా చేశారని విమర్శలు చేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: