డిటెక్టివ్ ‘ఛార్లీ’ గా రాబోతున్న మహేష్…!!

Google+ Pinterest LinkedIn Tumblr +

‘భరత్ అను నేను’ సినిమాతో మంచి ఊపు మీద ఉన్నాడు టాలీవుడ్ హీరో సుపెర్ స్టార్ మహేష్ బాబు. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వం లో ‘మహర్షి’ అనే సినిమా చేస్తున్నారు, ఇందులో పూజ హెగ్డే ని హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్వినిదత్త్ లు నిర్మిస్తున్నారు. మహేష్ కెరీర్ లో ఇది 25 వ చిత్రం అవ్వడం వల్ల మహేశ్ అభిమాణుల్లో ఆసక్తి అంచనాలు భారీగా ఉన్నాయి.

మహేష్ కేవలం నాటనకే పరిమితం అవ్వకుండా అటు నిర్మాతగా, బిజినెస్ మ్యాన్ గా రోజురోజుకి మరింత విస్తరించుకుంటున్నాడు. ప్రస్తుతం వెబ్ సిరీస్ లకి మంచి మార్కెట్ ఉందని బావించిన మహేష్ జియో ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి వెబ్ సిరీస్‌కు ప్లాన్ చేస్తున్నాడు నాన్న‌కు ప్రేమ‌తో చిత్రానికి ర‌చ‌యిత‌గా ప‌ని చేసిన హుస్సేన్ షా కిర‌ణ్ ఈ వెబ్ సిరీస్ ని తెర‌కెక్కించ‌నున్నారు. మీడియా సమాచారం మేరకు దీనికి ‘ఛార్లీ’ అనే టైటిల్ ని కరారు చేశారు. డిటెక్టివ్ త‌ర‌హా క‌థ‌తో ఈ వెబ్ సిరీస్ రూపొంద‌నుంద‌ని అంటున్నారు. మూడు సీజ‌న్ లు 24 ఎపిసోడ్స్‌గా ఈ వెబ్ సిరీస్‌ని విడుద‌ల చేయాల‌ని అనుకుంటునట్టుగా సమాచారం. ఈ వెబ్ సిరీస్ నిర్మాణం లో మహేష్ కూడా భాగస్వామ్యం కాబోతున్నారు. ఈ వెబ్ సిరీస్ హిందీ ప్రేక్షకులు కూడా చూసేందుకు వీలు గా హిందీ లో కూడా రూపొందించబోతున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: