ముగ్గురు మూడు పార్టీలకి..

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ కి చెందిన ముగ్గురు ఎమ్మెల్యే లు తమ పధవులకు రాజీనామా తెలుపుతూ స్పీకర్ కోడెల కి వినతి పత్రం అంధజేశారు.ఈ క్రమంలో ఆకుల సత్యనారాయణ(బీజేపీ), రావెల కిశోర్‌బాబు(టీడీపీ), మేడా మల్లికార్జున్‌రెడ్డి(టీడీపీ)ల రాజీనామాలను స్పీకర్ ఆమోధించారు. మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ స్థానాల్లో ఉపఎన్నికలకు ఆస్కారం ఉండదని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి.
మాజీ ఐఏఎస్ అధికారి అయిన రావేల కిశోర్ బాబు గుంటూరు ప్రతిపాడు నుండి టి‌డి‌పి తరఫున పోటీ చేశారు. ఏపీ కేబినెట్‌లో సాంఘిక, గిరిజ‌న సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. మేడా మల్లికార్జునరెడ్డి టీడీపీ తరఫున 2014లో రాజంపేట నుంచి గెలిచారు ఇటీవల ఎమ్మెల్యే పదవికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. గురువారం ఆయన వైఎస్ జగన్ సమక్షంలో వైపీపీలో చేరారు. . ఆకుల సత్యనారాయణ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున విజయం సాధించారు అయితే, ఎన్నికలకు కొన్ని నెలల ముందు వారు తమ పదవులకు రాజీనామా చేసి పవన్ సమక్షం లో జనసేన లో చేరారు
ఎన్నికలకు ముందు ఎమ్మెల్యేలు జంప్ కావడం ఆయా పార్టీలకు షాకింగ్‌గా మారింది. అయితే, రాష్ట్రంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవాలంటూ కొన్నాళ్లుగా వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నా స్పీకర్ వారిపై వేటు వేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.

Share.

Comments are closed.

%d bloggers like this: