డబ్బు గురించే జయరాం ని చంపాను….రాకేష్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రముఖ వ్యాపార వేత్త కోస్టల్ బ్యాంక్ అధినేత జయరామ్ అనుమానాస్పద రీతిలో మరణించి ఉండటం అనేక అనుమానాలకి దారితీసింది. ఈ కేసులో రోజు రోజుకి ఒక కొత్త ట్విస్ట్ రావడం, ముద్ధాయి ఎవరా అన్న ప్రశ్నలు ప్రజల్లో పోలీసు శాకలో ఆసక్తిని రేపాయి. పోలీసులు ఈ కేసులో ముఖ్య నింధితులుగా భావించిన వ్యక్తులు జయరామ్ మేన కోడలు శిఖా చౌదరి, తన ప్రియుడు రాకేష్ రెడ్డి..
వీరిద్దరి మద్య ఉన్న లావాదేవిల వల్లే జయరాం ని చంపడం జరిగిందని వార్తలు వచ్చాయి. ఒక పట్టాన శిఖా పై అనుమానాలు వచ్చినా మరోపక్క తన ప్రియుడు రాకేశ్ రెడ్డి పై కూడా అదే రీతిలో అనుమానాలి వ్యక్తమయ్యాయి.

పోలీసుల విచారణ మేరకు మిస్టరీ వీడినట్టే అని కథనాలు వినిపిస్తున్నాయి. శిఖా చౌదరి ప్రియుడిగా చెబుతున్న రాకేష్ రెడ్డే ఈ హత్య చేశాడని పోలీసులు నిర్దారించారు. రాకేష్ రెడ్డి వద్ద తీసుకున్న రూ.4.5కోట్ల అప్పు వ్యవహారమే హత్యకు దారి తీసినట్టు తేల్చారు. జయరాంను హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకెళ్లిన రాకేష్ రెడ్డి.. కారులోనే అతనికి పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చినట్టు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. జబ్బు సోకిన కుక్కలను చంపేందుకు ఉపయోగించే యుథనేషియా అనే పాయిజన్ ఇంజక్షన్‌ను ఇచ్చినట్టు తెలిపాడు. సాధారణంగా జబ్బు సోకిన కుక్కలకు ఈ ఇంజెక్షన్ ఇస్తే అవి మత్తులోకి జారుకుని చనిపోతాయి. యుథనేషియా ఇంజెక్షన్ గురించి తెలుసుకునేందుకు పోలీసులు పశు వైద్యుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అయితే హత్యలో శిఖా చౌదరి పాత్రపై ఇంకా అనుమానాలు తొలగిపోలేదు. హత్యతో ఆమెకు సంబంధం ఉందా? లేదా? అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

Share.

Comments are closed.

%d bloggers like this: