లారీ బ్రేకులు ఫేలయ్యి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

సరిగ్గా తెల్లవారు 3 గంటల ప్రాంతం విజయవాడ బీచ్ రోడ్డులో లారీ బ్రేకులు ఫేలయ్యి గోడను ఢీ కొట్టిన దృశ్యం చోటు చేసుకుంది. మూడేళ్ల క్రితం… నోవోటెల్ జంక్షన్ వద్ద అదే ప్రాంతంలో ఓ స్కూల్‌ బస్సు బీభత్సం సృష్టించింది. ఇందులో ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మళ్లీ ఇప్పుడు అదే ప్రాంతంలో అదే తీరులో ఓ ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. ఘటన జరిగింది తెల్లవారు జామున కావడం, ఆ సమయానికి ఇంకా వాకర్స్‌ కూడా రాకపోవడంతో అదృష్టవశాత్తు పెద్ద ఘోరమే తప్పింది.

విశాఖ నగరం బీచ్‌ రోడ్డులో అదుపుతప్పిన ఓ లారీ గురువారం తెల్లవారు జామున బీభత్సం సృష్టించడం స్థానికంగా సంచలనమైంది. బీచ్‌ రోడ్డులోని నోవాటెల్‌ హోటల్‌ జంక్షన్‌లో జరిగిన ఈ ప్రమాదం వివరాలిలావున్నాయి. హోటల్‌ను ఆనుకుని ఉన్న పందిమెట్ట రోడ్డు మీదుగా ఇసుక లోడుతో బీచ్‌ రోడ్డు వైపు లారీ వస్తోంది. ఇక్కడ వాహనం మలుపు తీసుకోవాల్సి ఉంటుంది. రోడ్డు ఎత్తుగా ఉండడం, లారీ బ్రేకులు ఫెయిల్‌ కావడంతో వాహనం అదుపుతప్పి నేరుగా వెళ్లి రక్షణ గోడను ఢీకొట్టింది. గోడను ధ్వంసం చేసుకుంటూ అటువైపు ఉన్న పిల్లల పార్క్‌వైపు దూసుకుపోయింది. లారీ ఢీకొట్టిన ప్రాంతంలో సాధారణంగా బీచ్‌ సందర్శకులు ఎప్పుడూ కూర్చుని ఉంటారు. తెల్లవారు జాము కావడంతో ఘటన జరిగిన సమయానికి అక్కడ ఎవరూ లేరు.

Share.

Comments are closed.

%d bloggers like this: