ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఫైర్..

Google+ Pinterest LinkedIn Tumblr +

టి‌డి‌పి ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న బి‌జే‌పి, వై‌సి‌పి వర్గాలపై ఆయా పార్టీల నేతలపై సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. బి‌జే‌పి వై‌సి‌పి పార్టీలలో కొందరికి పిచ్చి ఎక్కువైపోయిందని రోజురోజుకి పిచ్చి పట్టిన వారి సంఖ్య ఎక్కువైపోయిందని ఆయన మండిపడ్డారు. ఈ పిచ్చి పట్టిన వారికి వెంటనే తగిన పద్దతి లో చికిత్స చేయించాలని లేకపోతే వారి పిచ్చి చేష్టలతో మిగితా వారికి కూడా ఆ పిచ్చి సోకుతునదని ఆయన అన్నారు.

అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆయన మాట్లాడుతూ ‘ బడ్జెట్ లోతు తో ఉన్న రాష్ట్రాన్ని అన్నీ రంగాల్లో ముందుకు తీసుకెళ్తూ మరోవైపు రాష్ట్రం లో ఉన్న అన్నీ వర్గాల ప్రజలకి అద్బుతమైన సంక్షేమ పాతకాలతో రాష్ట్రాన్ని విజయ పధంలో నడుపుతున్న చంద్రబాబుకి ప్రజలు నీరాజనాలు పడుతున్నారని ఆయన అన్నారు వై‌సి‌పి జాతీయ అధ్యక్షుడు వై‌ఎస్ జగన్, బి‌జే‌పి నేత జి‌వి‌ఎల్ నర్సింహా రావు దీన్ని చూసి తట్టుకోలేక చంద్రబాబు పై విమర్శలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇలా విమర్శలు చేయడం వల్ల వారికి ఎలాంటి లబ్ధి చేకూరదని ఇలాంటి విమర్శల వల్ల ప్రజలు వారిని పిచ్చి వల్లగా భావిస్తారని ఆయన అన్నారు. జి‌విఎల్ నర్సింహా రావు, వై‌ఎస్ జగన్ ఇద్దరు నోరు అదుపు లో పెట్టుకోకపోతే ప్రజలే వారికి దేహశుద్ది చేస్తారని ఆయన వారిని హెచ్చరించారు. 16 నెలలుగా ఆర్దిక నేరస్తుడిలా జైలు లో ఉన్న నీవు చంద్రబాబు పై విమర్శలు చేయడం వింతగా ఉందన్నారు. నివా ఉద్యోగుల పోదోన్నతల గురించి మాట్లాడేది..? ఉద్యోగులకి సరైన క్రమంలో పదోన్నత రాకపోతే వారు న్యాయస్తానాన్ని ఆశ్రయిస్తారని దీన్ని కూడా జగన్ మాట్లాడటం విడ్డూరం అని ఆయన పేర్కొన్నారు. జగన్ కులాల గురించి మాట్లాడుతూ ప్రజల్ని రెచ్చగొడుతున్నారని, ఏదొరకంగా సి‌ఎం అవ్వాలని అనుకుంటే సరిపోదు దానికి తగిన కష్టం చేయాలని ఆయన అన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: