137 బిలియన్ డాలర్లు..పాస్-వర్డ్ మాయం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

కెనడాకు చెందిన క్వాడ్రిగాసీఎక్స్ సంస్థ అధినేత గెరాల్డ్ కాటన్ భారత పర్యటనలో భాగంగా జైపూర్ లో ఒక అనదాశ్రమం ప్రారంభోత్సవానికి వచ్చి అనుమానాస్పద రీతిలో చనిపోయాడు. ఈ సంఘటన గత ఏడాధి డిసెంబర్ 9 న చోటు చేసుకుంది కథనం మేరకు ఆయన క్రోన్ అనే వ్యాది తో మరణించినట్టు వైదులు వెల్లడించారు. క్వాడ్రిగాసీఎక్స్ గురించి బి‌ట్ కాయిన్ ల గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. అయితే ఆయన మరణం తో కంపనీ ఒక్కసారిగా దివాళా తీసిన పరిస్తితి. వేలాది మంది కస్టమర్ల ఆశల్ని ఆవిరి చేస్తున్నది. వందల కోట్ల రూపాయలను అయోమయంలో పడేస్తున్నది.

137 బిలియన్ అమెరికన్‌ డాలర్ల క్రిప్టోకరెన్సీక ని ఈ సంస్థ కోల్డ్ వల్లెట్ అనే ఆఫ్-లైన్ అకౌంట్లలో క్వాడ్రిగా భద్రపరిచింది. ఈ ఖాతాలకు సంబంధించిన పాస్‌వర్డ్‌లు గెరాల్డ్‌కు మాత్రమే తెలుసు. గెరాల్డ్ చనిపోవడంతో ఇప్పుడు ఆ కరెన్సీ ఎవరికీ అందకుండాపోతున్నది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం మాత్రం కనిపించడం లేదు. ఎంత వెతికినా ఇంట్లో పాస్‌వర్డ్‌కు చెందిన వివరాలు ఏవి కూడా దొరకడం లేదని తనకు బెదిరింపులు సైతం వస్తున్నట్లు కాటన్ బార్య రాబర్ట్సన్ తెలిపారు.

దీంతో బిట్‌కాయిన్‌, లైట్‌ కాయిన్‌, ఎథిరియం వంటి డిజిటల్‌ కరెన్సీ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫాం క్వాడ్రిగా సీఎక్స్‌ ఎక్స్చేం జ్‌కు నోవా స్కోటియా ఉన్నత న్యాయస్థానం దివాలా రక్షణను మంజూరు చేసింది. ఈ వేదికపై కరెన్సీ ట్రేడింగ్ కూడా నిలిపివేసింది. అలాగే గెరాల్డ్‌ సెల్ ఫోన్లు, ఇతర కంప్యూటర్లలోని సమాచారం కోసం సంబంధిత ఎన్క్రిప్షన్లను ఛేదించడానికి నిపుణులతో ప్రయత్నిస్తున్నామనీ, కానీ ఫలితం లభించలేదన్నారు. క్వాడ్రిగాలో 363,000 యూజర్లు నమోదయ్యారు. క్రిప్టో కరెన్సీ రంగంలో నిపుణులైన వ్యక్తులు ఇరత కంప్యూటర్లు, కాటెన్‌ సెల్‌ఫోన్‌ నుంచి పాక్షిక సమాచారం రాబట్టారన్నారు. దీంతో ఇప్పటికైతే కొంత సొమ్మును గుర్తించగలిగారు.

మరోవైపు సోషల్ మీడియాలో తన భర్త మృతిపై అనేకానేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, గెరాల్డ్ నిజంగానే చనిపోయాడా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయని జెన్నిఫర్ రాబర్ట్‌సన్ తెలిపినట్లు ఓ ప్రకటనలో క్వాడ్రిగా వెల్లడించింది. తనకు బెదిరింపులు కూడా వస్తున్నట్లు ఆమె చెప్పారని క్వాడ్రిగా ఈ సందర్భంగా సదరు ప్రకటనలో పేర్కొన్నది. గతకొద్ది వారాలుగా గెరాల్డ్ మరణంతో ఏర్పడిన తమ ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామని, అయినప్పటికీ దురదృష్టవశాత్తు ఏవీ సఫలం కావడం లేదన్నది. రాబర్ట్‌సన్ సైతం ఎంత వెతికినా చిన్న క్లూ కూడా దొరకడం లేదంటున్నది. ఎక్కడైనా ఈ పాస్‌వర్డ్‌ల సమాచారం రాసి ఉంటారా? అన్న కోణంలోనూ అన్నిచోట్లా వెతికామని ఆమె చెబుతున్నది.

Share.

Comments are closed.

%d bloggers like this: