తెలుగు యువత కి చాలా పనుంది..!

Google+ Pinterest LinkedIn Tumblr +

దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్ చేస్తున్న కృషిని చూసి. తన పని తనానికి మెచ్చి 13 జిల్లాల యువతకి యువ నాయకుడిగా దేవినేని అవినాష్ తగిన వాడని ఆయనకి నిన్న తెలుగు యువత అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు. తెలుగు యువత అధ్యక్షుడి పాత్ర హరికృష్ణ ,దగ్గుబాటి వేంకటేశ్వర రావు లాంటి నాయకులు చేపట్టారు అలాంటి పాత్ర ఇప్పుడు దేవినేని అవినాష్ కి ఇవ్వడం గమనార్హం. దీనికి గాను నిన్న ఆయన ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ప్రమాణ స్వీకరానికి మద్దత్తుగా టిడిపి కార్యకర్తలు, తెలుగు యువత భారీ సంఖ్యలో వేలాదిగా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ సంధర్భంగా ఆయన ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించారు ప్రెస్ మీట్ లో భాగంగా ఆయన మాట్లాడుతూ ‘ తెలుగు యువత సదస్సుకు యువత వేల సంఖ్యలో పాల్గొనడం సంతోషంగా ఉంది. కార్యక్రమానికి సహకరించిన జిల్లా, అర్బన్ తెదేపా నాయకులు, మంత్రులకు నా ధన్యవాదాలు. దేవినేని నెహ్రూ గారితో కలిసి 30 సంవత్సరాలుగా జిల్లా వ్యాప్తంగా ఉన్న అనుచరులు, మిత్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జిల్లాలో పర్యటిస్తూ ప్రతి తెదేపా కార్యకర్తను, యువతను కలుపుకుని పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం. అమిత్ షా ఉత్తరాంధ్ర పర్యాటనలో ఖాళీ కుర్చీలు స్వాగతం పలికినా జీవియల్ కు బుద్ధి రాలేదు. ప్రభుత్వ విప్ బుద్ధా వెంకన్న పై జీవియల్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. రాష్ట్రానికి భాజపా ద్రోహం చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న తెదేపా నాయకులపై ఈ తరహా వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోము. చంద్రబాబు పై భాజపా కుట్రలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు, తగిన రీతిలో బుద్ధి చెబుతారు. చంద్రబాబు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిన బాధ్యత తెలుగు యువత పై ఉంది. రాబోయే ఎన్నికల్లో తెదేపా విజయానికి తెలుగు యువత కృషి చేయాలి. 2019 లో అవినాష్ ను ఎమ్మెల్యే చేసేదాక కష్టపడి పని చేయాలని పిలుపునిస్తున్నాం.

Share.

Comments are closed.

%d bloggers like this: