బాబు.. గొప్పల డప్పులు మాను..!

Google+ Pinterest LinkedIn Tumblr +

విషాకపట్నం లో నిన్న వై‌సి‌పి పార్టీ సీనియర్ నేత శ్రీ బొత్స సత్యన్నారాయణ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో భాగంగా ఆయన చంద్రబాబు పై విమర్శలు చేశారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ ‘శాసనసభలో చంద్రబాబు ఆయనకు ఆయనే పొగుడుకుంటున్నారు. సభలో లేనివారిని హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. వాస్తవాల్ని వివరించే ప్రయత్నం చంద్రబాబు చేయడం లేదు. చంద్రబాబుకు రామనామస్మరణలాగా జగన్ మోహన్ స్మరణ చేస్తున్నారు ఆని ఆయన అన్నారు.

వైయస్ జగన్ అన్నవస్తున్నాడు అని ప్రోగ్రామ్ పెడితే దాన్ని దున్నవస్తున్నాడని దాని పై వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి స్దానంలో ఉండి తలబిరుసుతనంతో మాట్లాడుతు్న్నారు అని ఆయన మండిపడ్డారు.

ఢిల్లీలో దీక్షకు కోటిన్నరకుపైగా డబ్బు కట్టి వారి తాబేదార్లను తీసుకువెళ్తున్నారు. ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. కేంద్రంలో భాగస్వామిగా ఉంటూ చంద్రబాబు ఏం సాధించారు..? రాష్ర్ట ఖర్చులు పెరిగాయి కాని ఆదాయం పెరగలేదు ! విద్యుత్ సరఫరాకు సంభందించి ఎన్ టి పి సి కి డబ్బు చెల్లించాల్సిఉంది. 2,130 కోట్ల రూపాయలు కట్టకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని నోటీసు ఇచ్చిందంటే ఆర్దికపరిస్దితి ఎలా అర్దం చేసుకోవచ్చు.

డ్వాక్రా సంఘాలకు చెక్కులు ఇచ్చారు.ఆ మహిళలు చెక్కులు తీసుకుని వెళ్తే మీ చెక్కులు వడ్డీలకింద జమ అయ్యాయని బ్యాంకులవాళ్లు చెబుతున్నారు. అసలు ఆంధ్రరాష్ర్డ చరిత్రలో ముందుగా చెక్కులు ఇచ్చిన పరిస్దితి ఉందా? చంద్రబాబు ,కియామోటార్స్ గురించి మాట్లాడుతూ వోక్స్ వ్యాగన్ లో నాపేరు ప్రస్తావన తెచ్చి విమర్శలు చేశారు.

ఈరోజు కియామోటార్స్ వస్తే స్దానికులకు ఉద్యోగాలు ఇచ్చారా? ఆనాడు మేం ఉన్నప్పుడు పరిశ్రమల శాఖమంత్రిగా అమెరికా వెళ్లి బాండ్రిక్స్ కంపెనీని తీసుకువచ్చి 25 వేల మందికి ఉపాది కల్పించాం.అది దివంగత వైయస్ ,మా ఘనత కాదా? నీ ముఖ్యమంత్రిగా పరిపాలన సమయంలో అంతా కలిపి కనీసం 25 వేల మందికి ఉపాధి కల్పించగలిగావా? నీకు నోరు ఉంది కదా అనుకుని అబద్దాలు నిజాలుగా నిజాలు అబద్దాలుగా చెబితే సరిపోతుందని అనుకుంటున్నావా. చంద్రబాబు నిన్ను ప్రజలను నమ్మడం లేదు. ఎందుకంటే రైతులను,డ్వాక్రా మహిళలను నీవు మోసం చేశావు అని ఆయన చంద్రబాబు పై మండిపడ్డారు.

Share.

Comments are closed.

%d bloggers like this: