బిగ్‌బాస్ కి తారక్ షరతులు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగులో గత స్సీజన్ల వల్ల బిగ్‌బాస్ షో కి మంచి క్రేజ్ వచ్చింది. అయితే మొదటి సీజన్ లో ఎన్‌టి‌ఆర్ హోస్ట్ చేయగా రెండవ సీజన్లో ఆయన బిజీగా ఉండడం వల్ల నేచురల్ స్టార్ నాని తెరపైకి వచ్చారు. అయితే ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన తర్వాత ఆ మార్కును అందుకోవడానికి నాని తంటాలు పడ్డారనే వాదన కూడా వినిపించింది.

మొట్టమొదటి బిగ్‌బాస్ షోకు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించడంతో ఆ కార్యక్రమం మరోస్థాయికి వెళ్లిన సంగతి తెలిసిందే. తెలుగు బిగ్‌బాస్‌ షోకు ఎన్టీఆర్ ఓ క్రేజ్ తెచ్చారనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.అయితే నాని బిగ్‌బాస్‌ను మరోస్థాయికి తీసుకెళ్లలేకపోయాడనే మాట కూడా వినిపించింది. దాంతో తాజాగా మూడో సీజన్‌కు మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది. అయితే తారక్ ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరించడానికి ఒప్పకొంటారా? అనే ప్రశ్న రేకెత్తుతున్న నేపథ్యంలో పలు ఆసక్తికరమైన కథనాలు మీడియాలో కనిపిస్తున్నాయి.

అయితే ఎన్‌టి‌ఆర్ బిగ్‌బాస్ షోకు హోస్ట్‌గా వ్యవహరించకపోవచ్చు ఎందుకంటే ప్రస్తుతం దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న RRR మూవీలో ఎన్టీఆర్ కీలక పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రెండు రకాల షేడ్స్ ఉన్న పాత్రలో తారక్ కనిపించబోతున్నాడని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అందుచేత బిగ్‌బాస్‌‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తే గెటప్ బయటకు వచ్చే అవకాశం ఉంది. అందుచేత రాజమౌళి అందుకు ఒప్పుకొంటాడా అనేది మరో ప్రశ్న.

ఒకవేళ ఎన్‌టి‌ఆర్ షో నిర్వహించినా బిగ్‌బాస్ మేనేజ్‌మెంట్‌కు కొన్ని షరతులు విధించినట్టు ఓ వార్త ప్రచారంలో ఉంది. హోస్ట్‌గా ఒప్పుకోవడానికి ముందు ఎన్టీఆర్ బిగ్‌బాస్ మేనేజ్‌మెంట్‌కు విధించిన షరతుల ఇలా ఉన్నాయని తెలుస్తున్నది. మూడో సీజన్ కోసం ఎంపిక చేసిన ఇంటి సభ్యుల జాబితా. పరిశీలనలో ఉన్న వ్యక్తుల వడపోత విధానం పక్కాగా ఉండాలని, అలాగే ఎవరి ప్రోద్బలం, లాబీయింగ్ వల్ల ఇంటి సభ్యులను ఎంపిక చేయవద్దని షరతులు పెట్టినట్టు తెలుస్తున్నది.

Share.

Comments are closed.

%d bloggers like this: