రజని(19) కిడ్నాప్ కలకలం..

Google+ Pinterest LinkedIn Tumblr +

నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్, దీనదయాల్ నగర్ పరిధిలో ఒక కిడ్నాప్ కాసు చోటు చేసుకుంది. దీనదయాల్ నగర్ కి చెందిన రజని అనే 19 సంవత్సరాల యువతిని మాజీ ప్రియుడు సంతోష్ అనే యువకుడు కిడ్నాప్ చేసాడు. రజని కనపడకపోవడం తో కంగారూ పడ్డ తల్లిదండ్రులు వెంటనే పోలీసులకి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు 12 గంటల వ్యవదిలోనే కిడ్నాపర్లను ఛేదించి పట్టుకుని నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ కి విచారణ నిమిత్తం తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో రజని పాత నేరేడ్మెట్ లోని బంధువుల ఇంటికి వెళ్తుండగా ఆమెను ఆటోలో వెంబడించిన ఆమె మాజీ ప్రియుడు సంతోష్ మరియు అతని మిత్రుడు మధు ఆమెను కొట్టి బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని వెళ్లిపోయారు. ఇది చూసిన ఆమె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సెల్ టవర్ సిగ్నల్ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: