పిల్లలని మాయం చేసే డాక్టర్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

వికలాంగురాలైన ఎస్సీ గర్భవతికి ఆపరేషన్ చేసి శిశువుని బయటకు తీసి మాయం చేశారు. పుట్టిన బిడ్డ ఆడో, మగో కూడా తెలియని వైనం! అవును ఇది నిజం. మచిలీపట్నం, జవ్వారుపేట సెంటర్లోని వాణి హాస్పిటల్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది.

కథ లోకి వెళితే ’ గర్భవతికి డెలివరీ అయ్యి మూడురోజులు గడిచినా శిశువును తల్లికి చూపించకుండా తాత్సర్యం చేశారు, పుట్టిన బిడ్డ ఆడో మాగో కూడా తల్లికి తెలియని వైనం. బిడ్డను చూసేందుకు తల్లి ఆరాటం. పుట్టిన శిశువు ని మాయం చేయడం వెనుక లేడి డాక్టర్ కీలక హస్తం ఉందని సమాచారం.

నీటికనితితో భాధపడుతున్న వికలాంగురాలైన గర్భవతికి ఆపరేషన్ చేసిన డాక్టర్… డాక్టర్ వ్యవహారం పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు బంధువులు. ఆగ్రహం చెందిన బాధితురాలి బంధువులు, కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు డాక్టర్ పరసా వాణి కుసుమ ను ఆధుపులోకి తీసుకున్నారు.

ఈ విషయాన్ని ఛేదించిన ఇనుగుదురుపేట పోలీసుల కధనం ప్రకారం ‘విజయవాడలోని పాత గవర్నమెంట్ ఆసుపత్రి పిల్లల వార్డులో వైద్యం కోసం ఉంచిన పిల్లలని అక్కడనుంచి మాయం చేసి మచిలీపట్నం, దేశాయి పేటకు చెందిన లక్షిణారాయన అనే వ్యక్తి డాక్టర్ వాణికుసుమ తో కలిసి అమ్మేస్తునట్టు తేలింది’ దీంతో డాక్టర్ వాణికుసుమ ను లక్షిణారాయన ను ఆధుపులోకి తీసుకున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: