నటుడు శివాజీ జలదీక్ష..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ నిన్న ఆంధ్రప్రదేశ్ చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కి మోదీ చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ నిన్న అందరూ నల్ల దుస్తులు ధరించాలని నల్లటి బెలూన్లు ఎగరవేయాలని ఆయన సభ ని అడ్డుకోవాలని ఏపి సి‌ఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ ప్రకటనకి అనుకూలంగా ప్రజలు, రాజకీయ ప్రముఖులు నిన్న భారిఎత్తున నిరసనలు, ఆంధోళనలు వ్యక్తం చేశారు.

ఈ సంధర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు నిరసనగా సినీ హీరో శివాజీ విజయవాడలోని దుర్గా ఘాట్‌లో వినూత్న నిరసన చేపట్టారు. జలదీక్ష చేపట్టారు..! మోదీ రాష్ట్రానికి వచ్చినప్పటి నుంచి తిరిగి వెళ్లేవరకు ఆయన జలదీక్ష చేపట్టారు. మోదీ రాష్టం విడిచి వెళ్లేవరకు పైకి వచ్చేది లేదని స్పష్టం చేశారు. ఏపీకి అన్యాయం చేసిన మోదీ అపవిత్ర పాదాలతో రాష్ట్రంలో అడుగుపెడుతున్నారని విమర్శించారు. శివాజీకి మద్దతుగా పలువురు యువకులు సైతం జలదీక్షలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ… నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం రాష్ట్రం పోరాడుతున్నా ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదు. మోదీ ఓ పొలిటికల్ టెర్రరిస్టు. దేశానికి దొంగలా మారాడు. రాష్ట్రంలోని ప్రాజెక్టులు, రోడ్ల కోసం లక్షల కోట్లు ఇచ్చామని ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతున్నారు. తాను ప్రయాణించే విమానానికి రూ.1400కోట్లు ఖర్చు పెట్టిన మోదీ.. 5కోట్ల మంది ప్రజల కలల రాజధాని అమరావతికి మాత్రం రూ.1500కోట్లే ఇవ్వడం సిగ్గుచేటు. ఒక రాష్ట్రం పట్ల ఇంత దుర్మార్గంగా ప్రవర్తించిన ప్రధానమంత్రి దేశంలో ఇప్పటివరకు లేరు’ అని అన్నారు.
విభజన హామీలు నెరవేర్చని మోదీ రాష్ట్రానికి వస్తుంటే వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్ ఎందుకు వ్యతిరేకించడం లేదని శివాజీ ప్రశ్నించారు. మోదీ పర్యటనకు ఎవరు మద్దతిస్తున్నారో, ప్రజలను ఎవరు తరలిస్తున్నారో, బ్యానర్లు ఎవరు కడుతున్నారో అందరికీ తెలుసన్నారు. ఏపీకి రెండు పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని గతంలో అన్న పవన్ కళ్యాణ్.. ఇప్పుడు మోదీని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై ఆయనకు స్పష్టత లేదని అన్నారు. తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోని మోదీవి అపవిత్ర పాదాలేనని, అందుకే ఆయన తిరిగి వెళ్లేవరకు జలదీక్ష చేస్తానని శివాజీ తెలిపారు.

Share.

Comments are closed.

%d bloggers like this: