సింహా, లెజెండ్‌.. నెక్స్ట్ ఏంటి..?

Google+ Pinterest LinkedIn Tumblr +

బాలకృష్ణ ప్రస్తుతం ‘యన్‌.టి.ఆర్‌’ రెండో భాగం ‘మహానాయకుడు’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. క్రిష్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రెండో భాగానికి సంబంధించిన షూటింగ్‌ చాలా రోజుల క్రితమే పూర్తయినట్లు సమాచారం. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఫిబ్రవరి 7న చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ‘యన్‌.టి.ఆర్‌’ తొలి భాగం ‘కథానాయకుడు’ సంక్రాంతి సందర్భంగా విడుదలై, మంచి టాక్‌ అందుకున్న సంగతి తెలిసిందే.

బాలకృష్ణ రాబోయే సినిమా ఏది..? ఎవరితో తీయబోతున్నారు అని ప్రజల్లో అభిమానుల్లో ఆసక్తి మొదలయ్యింది. ఈ ప్రశ్నలకి సమాదానం దొరికినట్టే. దర్శకుడు బోయపాటి శ్రీను నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా రానున్న సినిమా తీయబోతున్నానని ఇటీవల ఓ వేదికపై చెప్పారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో ‘సింహా’, ‘లెజెండ్‌’ సినిమాలు వచ్చాయి. ఈ రెండూ మంచి విజయం సాధించాయి. దీంతో బోయపాటి-బాలయ్య కాంబినేషన్‌ సూపర్‌హిట్‌ అనే మార్క్‌ ఏర్పడింది.

ఈ మేరకు మరో హిట్‌ కొట్టాలని బోయపాటి స్క్రిప్టును సిద్ధం చేస్తున్నారట. ఆసక్తికరమైన కథను రెడీ చేసే పనిలో పడ్డారట. ఈ సినిమా ఆశించిన విజయం సాధిస్తే బోయపాటి-బాలయ్య హ్యాట్రిక్‌ కొట్టినట్లే. మరి వీరి కలయికలో వచ్చే ఈ కొత్త సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే ఎదురుచూడాల్సిందే. ఇంకా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

Share.

Comments are closed.

%d bloggers like this: