దీక్ష విరమించుకున్న బాబు..

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ కి జరుగుతున్నా అన్యాయానికి నిరసనగా విభజన హామీలు వెంటనే అమలు చేయాలని ఢిల్లీ లోని ఏపిన భవన్ వేధిక గా నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టి‌డి‌పి అధినేత చంద్రబాబు ధర్మపోరాట దీక్ష చేశారు. తొలుత రాజ్ ఘాట్ లో మహాత్మగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి దీక్ష ప్రారంభించారు. నిన్న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు జరిగిన ఈ దీక్ష కి రాజకీయ ప్రముఖులు ఏ‌ఐసిం‌సి అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రివల్, కమల్ నాథ్, దేవగౌడ, డెరెక్ ఓ బ్రెయిన్ తదితరులు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరూ తమ తమ మద్దత్తు తెలుపుతు దీక్ష లో పాల్గొని ప్రధాని మోదీ పై విరుచుకపడ్డారు. తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ కి జరుగుతున్నా అన్యాయాన్ని గుర్తు చేస్తూ మోదీ చేస్తున్న కుట్రలు, అన్యాయాల్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు కి మద్దత్తు తెలుపుతూ ప్రసంగించారు. ఇందులో భాగంగా రాహుల్ మాట్లాడుతూ కాపలాదారు ల ఉండాల్సిన ఒక ప్రధాని దొంగలా మారాడని’ ఇక ప్రజలు ఉపేక్షించరని ఆయన మోదీ పై తీవ్ర విమర్శలు చేశారు. ఇక నిన్న సాయంత్రం నాటికి సభకి చేరిన దేవగౌడ కొద్దిసేపు చంద్రబాబు తో మాట్లాడి చంద్రబాబు కి నిమ్మరసం ఇచ్చి ఆయన దీక్షని విరమింపజేశారు. ఈ విషయానికి సంభందించి ఈరోజు ఏపిు సి‌ఎం చంద్రబాబు సహా పలువు నేతలు రాష్ట్రపతిని కాలువనున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: