రోజుకో చట్టం..! రోజుకో అత్యాచారం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

చట్టంలో ఎన్ని మార్పులు చేసిన మరిన్ని కొత్త చట్టాలు తెచ్చిన అత్యాచారాల్ని ఆపలేకపోతున్నారు! మానభంగాల్ని.. యువతుల పై హత్యలని.. అరికట్టలేకపోతున్నారు. రోజుకో చట్టం రోజుకో అత్యాచారం అన్నట్టుగా మారింది కాలం. తాజాగా నిన్న రాత్రి గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరులో ఓ ప్రేమ జంటపై దాడి జరిగింది.

ఏకాంత ప్రదేశంలో ఉన్న ప్రేమికులు జ్యోతి, శ్రీనివాస్ పై అత్యంత కిరాతకంగా నలుగురు యువకులు దారుణమైన దాడి చేసారు ఆ యువతిని నిర్భంధించి అత్యాచారం చేసారు అంతటితో ఆగకుండా హత్య కి పాల్పడ్డారు! ఈ ఘటన సోమవారం (ఫిబ్రవరి 11) రాత్రి 9 గంటల ప్రాంతంలో గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు ఉడా టౌన్‌షిప్‌లో సమీపంలోని క్రికెట్ స్టేడియం ప్రాంతంలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ప్రాంతాన్ని పరిశీలించగా ఆ దృశ్యాలకు పోలీసులు సైతం కంగుతిన్నారు.

తాడేపల్లి మహానాడుకు చెందిన జ్యోతి గుంటూరులోని కాలేజ్ లో సర్టిఫికెట్స్ తీసుకునేందుకు ఇంటి నుంచి బయలుదేరింది. ప్రియుడు శ్రీనివాస్ తో కలిసి రాత్రి 9 గంటల సమయానికి స్టేడియంలోని ఓ ఏకాంత ప్రదేశానికి చేరుకుంది. వీరిని గమనించిన నలుగురు యువకులు ఈ దారుణానికి పాల్పడ్డారు. మునుపు దుండగులపై జ్యోతి, శ్రీనివాస్ ఇద్దరూ తిరగబడ్డారు. దీంతో ఆ యువకులు మరింత రెచ్చిపోయి ప్రియుడు శ్రీనివాస్ ను బీరు సీసాలతో కొట్టారు. అతను తీవ్రంగా గాయపడ్డాడు. ప్రియురాలు జ్యోతిని కూడా కొట్టిన నలుగురు యువకులు.. ఆ తర్వాత అత్యాచారం చేశారు.

ఈ ఘటనలో జ్యోతి అక్కడికక్కడే మృతి చెందింది. రక్తపు మడుగులో పడి ఉన్న శ్రీనివాస్ ను స్థానికులు, పోలీసులు ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాస్ నుంచి వివరాలు సేకరిస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ విచారణలో భాగంగా క్యూస్ టీమ్ డాగ్ స్వాడ్ తో ఘటనాస్థలంలో ఆధారాలను సేకరిస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: