ప్రియాంక ప్లస్ ఆ! మైనస్ ఆ!

Google+ Pinterest LinkedIn Tumblr +

కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి సోనియా గాంధీ తన కూతురు ప్రియాంక వాడ్రా అలియాస్ ప్రియాంకా గాంధీ ని రాజకీయ రణరంగం లోకి దింపింది. ఇంధిర గాంధీ మఖ కవలికలు, రూపు, శైలి.. తన ఆలోచనా శక్తులను వంట బోసుకునట్టుగా ఉండటం ప్రియాంక కి ప్లస్ పాయింట్స్. వీటిని క్యాష్ ఇన్న్ చేసుకోడానికి కాంగ్రెస్ పార్టీ ని బలోపేతం చేయడానికి ప్రచారాల జోరు పెంచడానికి ప్రియాంకా ని రాజకీయం లోకి దింపింది అనడం లో అతిశెయోక్తేమి లేదు. చీర కట్టు లో ప్రియాంకా ప్రచారాల్ని చూస్తుంటే ప్రజలకి ఇందిరమ్మని చూస్తునట్టుందేమో..! ప్రియాంకా ప్రచారాలన్నీ హిట్ అవుతున్నాయి. ప్రియాంకను చూసి యుపి కాంగ్రెస్ జనాలు ఫిదా అవుతున్నారు. యూ‌పి లో తన ప్రచారాలకి భారి స్పందన అందుతుంది.

కానీ అదే సమయంలో మోడీపై ఐక్యపోరుకు ఈ వ్యవహారం గండికొట్టేలా కనిపిస్తోంది. ఎందుకంటే యుపిలో అధికారం కోసం పోటీపడే ఎస్ పి, బిఎస్పీలు రెండూ వైరాన్ని తాత్కాలికంగా పక్కనపెట్టి, ఒక్కతాటిపైకి వచ్చాయి. ఇప్పుడు ప్రియాంక వ్యవహారం చూసి చూడనట్లు వదిలేస్తే, చాలాకాలం తరువాత కాంగ్రెస్ కు ఆ రాష్ట్రంలో మంచిరోజులు వచ్చే ప్రమాదం వుందన్న కలవరం ఆ రెండు పార్టీలకు మొదలైంది.

అయిన ఇవన్నీ ఇప్పటికిప్పుడు ఉత్పన్నమయ్యే సమస్యలు కావు. ఎన్నికల అనంతరం సంభవించే పరిణామాలు. కానీ సమస్య ఏమిటంటే, కూటమి మీద గతంలో వున్నంత ఆసక్తి ఇకపై వుండడంలో మాత్రం ప్రియాంక ఎంట్రీ కొంత ప్రభావం చూపించే అవకాశం వుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: