1 నటుడు 2 రౌడీలు 3 పోలిసులు..జయరామ్ హత్య లో కొత్త ట్విస్ట్లు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్ హత్యకేసులో మరిన్ని ట్విస్ట్ లు కోణాలు ఉన్నాయంటు రోజుకో ట్విస్ట్ చొప్పున నిందితుల్ని వెలుగులోకి తెస్తున్నారు తెలంగాణ పోలీసులు. జయరాం హత్యకేసును విచారిస్తున్న తెలంగాణ పోలీసులు మరిన్ని సంచలన నిజాలను వెలుగులోకి తెచ్చారు. ఈ హత్య లో ఒక నటుడు, ఇద్దరు రౌడీ షీటర్లు, ముగ్గురు పోలీసు అధికారుల హస్తం ఉన్నట్టు వెల్లడించారు.

దస్ పల్లా హోటల్ లో ఉన్న జయరామ్ ను, వీణ అనే యువతి పేరిట ట్రాప్ చేసిన రాకేశ్, ఆమె మాట్లాడినట్టుగా ఓ యువతితో మాట్లాడించి, జయరామ్ ను ఆహ్వానించాడని, కారును పంపుతున్నట్టు చెప్పగా, జయరామ్ వచ్చేందుకు అంగీకరించాడని పోలీసులు వెల్లడించారు. దస్ పల్లా హోటల్ కు కారు తీసుకువెళ్లిన సూర్య, తాను వీణా మేడమ్ డ్రైవర్ నని, మిమ్మల్ని తీసుకురమ్మని పంపారని చెప్పి, జయరామ్ ను రాకేశ్ ఇంటికి చేర్చాడు.

ఆపై జయరామ్ తో రూ. 100 బాండ్ పేపర్లపై బలవంతంగా సంతకాలు తీసుకుని హత్య చేశారని తెలుస్తోందని చెప్పారు. హత్య జరిగే సమయంలో సీన్ లో రౌడీషీటర్ నగేశ్, నగేష్ అల్లుడు విశాల్, రాకేష్ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఉన్నారని తేలిందని, ఈ ఐదుగురినీ నిందితులుగా చేర్చనున్నామని పోలీసు వర్గాలు వెల్లడించాయి. హత్య అనంతరం జయరాం శవాన్ని కారులో ఉంచుకొని 5 గంటల పాటు హైదరబాద్ సమీప ప్రాంతాల్లో తిరిగినట్టుగా రాకేశ్ పేర్కొన్నాడు. హత్య జరిగిన సమయం లో రాకేశ్ ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డితో 29 సార్లు, నల్లకుంట ఎస్ఐ శ్రీనివాస్‌తో 13 సార్లు మాట్లాడినట్లు కాల్‌డేటా విశ్లేషణలో వెల్లడయ్యిందని పోలీసులు పేర్కొన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: