నీకు ఆ ధైర్యం లేదు.. టికెట్ దక్కదు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

నిన్న ఉదయం వై‌సి‌పి అధినేత జగన్ ను లోటస్ పాండ్ లో కలిసి అనంతరం ఆయన సమక్షం లో పార్టీ లో చేరారు అవంతి శ్రీనివాస్ రావు. పార్టీ లో చేరిన కొద్ది సేపటికే ఆయన వీడిన పార్టీ పై ముఖ్యమంత్రి చంద్రబాబు పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నిత్యం చంద్రబాబుని కొలిచే అవంతి ఇలా పార్టీ విడగానే విమర్శలు చేయడం పై బగ్గుమంటున్నాయి టి‌డిపి వర్గాలు.

దీనికి స్పందిస్తూ టిడిపి పార్టీ మానవ వనరుల శాక, విధ్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాస్ అవంతి పై బగ్గుమన్నారు. అవంతి పై విమర్శలు చేశారు. చంద్రబాబును కాపుమిత్ర అంటూ నెలరోజుల క్రితమే నీవు పాలాభిషేకం చేశావు. ‘జగన్ ఉగ్రవాది కంటే ప్రమాదకారి అని రాజకీయాల నుంచి ఆయనని వెంటనే బహిష్కరించాలి అని అవంతి అన్నారు. అలాంటి వ్యక్తే మరలా పోయి అదే పార్టీ చేరడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పార్టీ మారాక అవంతి శ్రీనివాస్ చేస్తున్న విమర్శలను ప్రజలు హర్షించరు అని ఆయన అన్నారు.

నేను ప్రజారాజ్యంలోకి వెళ్లేముందు చంద్రబాబును కానీ పార్టీని కానీ ఒక్కమాట కూడా అనలేదు. కానీ నీవు పార్టీ మారగానే విమర్శలు చేస్తున్నావు.. నీది సరైన రాజకీయం కాదు. నేను కాంగ్రెస్ మంత్రిగా ఉంటూనే చంద్రబాబు నా రోల్ మోడల్ అని చెప్పాను నీకు ఆ ధైర్యం లేదు. 1999 నుంచీ నేను ఎక్కడ టిక్కెట్ కోరుకుంటే నాకు అక్కడ టికెట్ లభిస్తోంది. అలాంటిది ని గురించి నేను భీమిలీ టిక్కెట్ వదలుకునేందుకు సిద్ధమయ్యా. రాష్ట్రంలో అన్ని జిల్లాల వైసిపి ఇన్ ఛార్జ్ లు జగన్ సామాజిక వర్గం వారే.. నీకోసం ఆయన వారిని వదులుకోరు. నీకు టికెట్ దొరకడం కూడా కష్టమే అంటూ అవంతి పై విరుచుకపడ్డారు.

Share.

Comments are closed.

%d bloggers like this: