ప్రేమికుడే కిరాతకుడైతే..!

Google+ Pinterest LinkedIn Tumblr +

చట్టంలో ఎన్ని మార్పులు చేసిన మరిన్ని కొత్త చట్టాలు తెచ్చిన అత్యాచారాల్ని ఆపలేకపోతున్నారు! అరికట్టలేకపోతున్నారు! మానభంగాల్ని.. యువతుల పై హత్యలని.. అరికట్టలేకపోతున్నారు. రోజుకో చట్టం రోజుకో అత్యాచారం అన్నట్టుగా మారింది కాలం.

ఏకాంత ప్రదేశంలో ఉన్న ప్రేమికులు జ్యోతి, శ్రీనివాస్ పై అత్యంత కిరాతకంగా నలుగురు యువకులు దారుణమైన దాడి చేసారని ఆ యువతిని నిర్భంధించి అత్యాచారం చేసారని అంతటితో ఆగకుండా హత్య కి పాల్పడ్డారని ఇదివరకే తెలిసింది. ఈ ఘటన సోమవారం (ఫిబ్రవరి 11) రాత్రి 9 గంటల ప్రాంతంలో గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు ఉడా టౌన్‌షిప్‌లో సమీపంలోని క్రికెట్ స్టేడియం ప్రాంతంలో జరిగింది.

విషయం తెలుసుకున్న పోలీసులు ఈ ఘటన పై విచారణ కొనసాగిస్తున్నారు. స్నిఫ్ఫర్ డాగ్లనీ సైతం రంగం లోకి దింపారు. విచారణలో భాగంగా కొన్ని సంచలనాలు బయటకొస్తున్నాయి. అయితే ప్రేమికుడు శ్రీనివాస్ ని వైధ్యం అనంతరం విచారణ చేయగా అతను బయటపెట్టిన వార్తలకి పోలీసులు సైతం కంగుతిన్నారు. అయితే కొద్ది నెలలుగా జ్యోతి శ్రీనివాస్ లు ప్రేమాయణం సాగిస్తున్నారు. ఈ నేపధ్యంలో జ్యోతి శ్రీనివాస్ ని కొన్ని నెలలుగా పెళ్లి చేసుకోమని వారిస్తుంది దీంతో విసిగిపోయిన శ్రీనివాస్ ఏం చేయాలో తెలియక జ్యోతి ని హత్య చేద్దాం అని నిశ్చయించుకున్నాడు. సోమవారం సాయంత్రం జ్యోతిని మంగళగిరి మండలం నవులూరు ఉడా టౌన్‌షిప్‌ సమీపంలోని క్రికెట్ స్టేడియం ప్రాంతానికి తీసుకెళ్లి మాటల్లో పెట్టి జ్యోతి పై దాడి చేసి, అత్యాచారం చేసి చంపేశాడు. ఎవ్వరికి ఎటువంటి అనుమానం రాకూడదని బీర్ బాటిళ్లతో తనకి తానే తన తలపై కొట్టుకొని మూర్చపోయాడు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకి మాయ మాటలు చెప్పాడు. ఎవరో గుర్తుతెలియని నలుగురు వచ్చి తమపై దాడి చేశారని జ్యోతి ని అత్యాచారం చేసి చంపేశారని చెప్పాడు తీరచూస్తే శ్రీనివాసే ఈ దాడికి పాల్పడినట్టు విచారణ లో తెలిసింది. తనపై ఎఫ్‌ఐ‌ఆర్ జారీ చేసి తదుపరి విచారణ చేస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: