50 లక్షల విరాళాలతో.. కే‌టి‌ఆర్

Google+ Pinterest LinkedIn Tumblr +

జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని భారతదేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. 44 మంది జవాన్ల ప్రాణాలు ఊరికేనే పోనివ్వమంటు ప్రధాని మోది చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరోసారి సుర్జికల్ స్ట్రైక్ కి ధారి తీసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. దేశమే ఇలా ఉంటే జవాన్ల కుటుంబాలు ఇంకా శోక సముద్రం నుండి బయటపడనటువంటి పరిస్థితి. మళ్ళీ వస్తాం అని తిరిగేల్లిన జవాన్లు తిరిగి శవాలుగా ముక్కలుగా ఇళ్ళకి వచ్చారు. జవాన్ల కుటుంబాలను ఆదుకొనేందుకు భారతదేశం ముందుకొస్తోంది. అమరుల కుటుంబాలని ఆదుకునే దిశగా దేశ నాయకులంతా తమ కృషికి తగ్గ విరాళాలు అందిస్తున్నారు.

ఇదే నేపధ్యం లో టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా ఆర్థిక సహాయం ప్రకటించారు. ఫిబ్రవరి 17వ తేదీ ఆదివారం ఉదయం నగరంలో ఉన్న సీఆర్పీఎఫ్ సౌత్ ఆఫీసుకు కేటీఆర్ చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన అమరులైన వీర జవాన్లకు కేటీఆర్ ఘనంగా నివాళులర్పించారు. జవాన్ల గౌరవార్థం తన వంతుగా రూ. 25 లక్షలు, స్నేహితులు ముందుకొచ్చి ఇచ్చిన మరో రూ. 25 లక్షలు అందిస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన చెక్కులను సీఆర్పీఎఫ్ ఐజీ జీహెచ్‌పీ రాజుకు కేటీఆర్ అందించారు. ఈ విషయాన్ని కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: