సెక్యులర్ ఇండియా అనేదే నా నినాదం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

కే ఏ పాల్ కామెంట్స్

నేనెందుకు రాజకీయాలలోకి వచ్చానో నా మిత్రులకి, అభిమానులకు, నన్ను వ్యంగ్యంగా మాట్లాడే వారికి సమాధానం చెప్పే అవసరం నాకు ఉంది. 16ఏళ్ళు బాలకార్మికుడిగా ఎన్నో కష్టాలు పడ్డాను అక్కడనుంచి ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్న సువార్తికుడిగా ఎదిగాను. అత్యంత ప్రజాదరణ ఉన్న సువార్తికుడిగా నాపై ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. ప్రపంచ శాంతి నా లక్ష్యంగా మార్చున్నాను. గ్లోబల్ పీస్ అధ్యక్షుడిగా గుర్తింపు తెచ్చుకున్నాను. ప్రపంచ శాంతి గురించి పాల్పడటం నాకు దేవుడిచ్చిన భాగ్యం.
MLA , MP గా పోటీచేయాలనుకుంటున్నాను, తప్పకుండా పోటీ చేస్తాను. విశాఖ, రాజమండ్రి, తిరుపతి, అనంతపురం, కాకినాడ ప్రాంతాలలో ఏదో ఒక ప్రాంతం నుంచి పోటీ చేయాలనుకుంటున్నాను. రాజకీయం అనే కుళ్ళు తీయడానికే నేను రాజకీయాలలోకి వచ్చాను. నేను గెలిచినా ఓడినా ఇక్కడే ఉంటా. నేను ఎవరి ఓట్లు చీల్చడానికి రాలేదు.

అధికారంలోకి వచ్చిన వెంటనే మా తల్లి గారి పేరుతో ప్రజలందరికీ ఉచిత వైద్యం.. సేవ అందిస్తా. మన రాష్ట్రంలో విద్యా వైద్యం ఉపాధి సరిగా లేదు. రైతు రుణ మాఫి, గిట్టుబాటు ధర రైతులకు కల్పిస్తాను. జిల్లాకో ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేస్తాము. సంవత్సర కాలంలో స్కూళ్ళు, ఆసుపత్రులు ప్రారంభించి చూపిస్తా..! ముఖ్యమంత్రి చంద్రబాబు లా శిలాఫలకాలు వేసి చేతులు దులుపుకోను. జగన్, పవన్ అంటే విదేశాలవారికి ఎవరికీ తెలియదు. వీరికి ఎవరైనా అప్పులైనా ఇస్తారా..? నేను సంవత్సరంలో రాష్ట్రాన్ని అభివృద్ది చేయలేకపోతే నా ట్రస్టు ఆస్తులన్నీ ntr ట్రస్టుకు రాసేస్తాను. మతం మారండీ అని నేను ఎవరినీ కోరలేదు … కోరను..! సెక్యులర్ ఇండియా అనేదే నా నినాదం.

Share.

Comments are closed.

%d bloggers like this: