మారణహోమం…ఘాజీ మరణం..! జై హింద్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

జమ్ముకాశ్మీర్‌ పుల్వామాన ప్రాంతాన్ని మృత్యు దేవత గుప్పెట్లో పెట్టుకుంది. రోజురోజుకి మృతుల సంఖ్య పెరిగిపోతుంది. ఎంత రక్తం చూసినా ఎన్ని ప్రాణాలు బలి తీసుకున్నా ఆ ప్రాంతాన్ని వదలట్లేదు. మొన్న జరిగిన ఉగ్రదాడిలో 44 మంది భారత జవాన్లు ప్రాణం కోల్పోయారు. ఈ సంఘటన నుండి ఇంకా కోలుకోలేని పరిస్థితి.. ప్రతీకార వాంఛతో భారత ప్రజలు రగిలిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేడు మళ్ళీ జేష్ ఏ మహమ్మద్ తీవ్రవాద సంస్థ కి చెందిన ఇద్దరు ఉగ్రవాదులు మన నలుగురు జవాన్ల ప్రాణాలు బలి తీసుకున్నారు.

పుల్వామా జిల్లాలోని పింగలాన్‌లో ఉగ్రవాదులు చొరబడ్డారని తెలిసి… భారత సైన్యం అప్రమత్తమైంది. ఉగ్రవాదులు అతి తెలివి ప్రదర్శించి. సైన్యమే టార్గెట్‌గా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మేజర్ సహా నలుగురు జవాన్లు చనిపోయారు. ఓ ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదులు గట్టిగానే ఎదురు కాల్పులు జరిపారు. కాల్పుల్ని తిప్పికొట్టిన CRPF రెండు గంటలపాటూ పోరాడి… కమ్రాన్, రషీద్ ఘాజీ అనే ఇద్దరు ఉగ్రవాదుల్ని మట్టికరిపించింది.

హతమైన ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకరైన రషీద్ ఘాజీ… పుల్వామా ఉగ్రదాడికి మాస్టర్ మైండ్‌ అని సైన్యం చెబుతోంది. మరో ఉగ్రవాది జైషే కమాండర్ కమ్రాన్‌‌గా తెలిసింది. ఇతడు 15 మంది ఉగ్రవాదులతో కలిసి జనవరిలో ఫూంచ్ సెక్టార్ నుంచి భారత్‌లోకి చొరబడ్డాడు.

రషీద్ ఘాజీ మాత్రం డిసెంబర్ తొలి వారంలోనే కుప్వారా ద్వారా భారత్‌లోకి చొరబడినట్లు తెలిసింది. జేఈఎం చీఫ్ మసూద్ అజర్‌కు అత్యంత సన్నిహితుడైన ఘాజీ ఆఫ్ఘనిస్థాన్‌కు చెందినవాడు. యుద్ధతంత్రంలో, అత్యాధునిక పేలుడు పదార్థా (ఐఈడీ)లను పేల్చడంలో ఇతడు సిద్ధహస్తుడు అని ఇంటెలిజెన్స్ పేర్కొంది.

Share.

Comments are closed.

%d bloggers like this: