మిస్టర్ 420 అని జగన్ పై సినిమా తీయాలి-బుద్ధా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎన్నికల సంధర్భంగా కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ లో టిడిపి పార్టీ వారు వై‌సి‌పి పై వై‌సి‌పి వారు టి‌డి‌పి పై విరుచుకపడుతున్నారు.. విమర్శల వాన కురిపిస్తున్నారు. ఒకరి పై ఒకరు మాటల యుద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపధ్యం లో టి‌డి‌పి పార్టీ ఎం‌ఎల్‌సి ప్రభుత్వ విప్ బుద్ధా వెంకన్న వై‌సి‌పి పార్టీ వర్గాలపై పార్టీ అధినేత జగన్ పై ఫైరయ్యారు. తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆయన నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో బుద్ధా జగన్ పై మాటల తూటాలు తో దాడి చేశారు.

ఆయన మాట్లాడుతూ ‘రాష్ట్రంలో బయోపిక్ ల కాలం నడుస్తుంది, మిస్టర్ 420 అని జగన్ పై సినిమా తీయాలి, జగన్ చెప్పేవి అన్ని మోసపూరిత మాటలే..పక్క రాష్ట్రం వారి పంచన చేరి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీసేలా ప్రవర్తిస్తున్నారు..

బీసి గర్జనకు జనం లేక పక్క రాష్ట్రం కోదాడ నుండి జనాన్ని రప్పించారు ఇది జగన్ పరిస్థితి. రాబోయే ఎన్నికల అనంతరం జైలుకెళ్లడం ఖాయమని జగన్ కు అర్ధమైంది..ఈ రాష్ట్రంలో పోలీస్ ల మీద నమ్మకం లేదని,పక్క రాష్ట్రంలో జైళ్లు బాగుంటాయని వారి పంచన చేరారు..

బిసి లకు మీరు కానీ మీ తండ్రి కానీ ఎప్పుడైనా వెన్నుదన్నుగా ఉన్నారా ?..మూడు సంవత్సరాలు అసెంబ్లీ కి వచ్చావు, ఏనాడైనా బిసిల ప్రయోజనాలకై అసెంబ్లీ లో మాట్లాడావా?..కులాలకు మేనిఫెస్టో పెట్టింది చంద్రబాబు,మీరు మీ మేనిఫెస్టో లో పెట్టార?..బిసి లకు అది చేస్తాం ఇది చేస్తాం అని మాయ మాటలు చెబుతున్నారు.. అంటూ జగన్ పై ఫైరయ్యారు.

తితిదే లాంటి దేవాలయం చైర్మన్ గా ఉన్నది బిసి లు. రాష్ట్రం లో 8 మంది బిసి మంత్రులు ఉన్నారు..మీ నాన్న గారి హయాంలో ఎంత మంది బిసి లకు ప్రాధాన్యత కల్పించారు..? అని ప్రశ్నించారు, రాష్ట్ర ప్రజలు అందరూ చంద్రబాబుతోనే ఉన్నారు..అవినీతి పరులను పార్టీ నుండి తీసేయాలని చంద్రబాబు చూస్తున్నారు, ఈ క్రమం లో అలాంటి అవినీతిపరులే వైకాపా లోకి వెళ్తున్నారు.. వైకాపాలో పోటీకి సరైన అభ్యర్థులే లేరు..! అంటూ ఫినిష్ చేశాడు.

Share.

Comments are closed.

%d bloggers like this: