481 అతిధులు.. సమక్షం లో ప్రమాణ స్వీకారం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఈరోజు ఉదయం 11.30 గంటలకి తెలంగాణ క్యాబినెట్ విస్తరణ లో భాగంగా 10 మంది ఎమ్మెల్యే లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్, మహ్మూద్ అలీ ఇది వరకే ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే రాజ్యాంగం ప్రకారం మొత్తం ఎమ్మెల్యేల్లో 15 శాతం అంటే 120 మందిలో సీఎంతో కలిపి 18 మందికి క్యాబినెట్లో చోటు కల్పించే ఆస్కారం ఉంటుంది. ప్రస్తుత 10 మందితో కలిపి మంత్రివర్గంలో మొత్తం 12 మంది అయ్యారు. ఇంకో 6 ఖాళీలు ఉన్నాయి. వీటిని లోక్ సభ ఎన్నికల తరవాత భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎస్టీలకు, మహిళలకు క్యాబినెట్లో చోటు కల్పించడం లాంటి సామాజిక సమీకరణాలపై ముఖ్యమంత్రి అప్పుడే దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయి. ఈసారి చోటు దక్కని మరికొంత మందికి అప్పుడు అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది.

రాజ్‌భవన్‌లో ఇవాళ ఉదయం జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి సహా మొత్తం 481 మంది హాజరవుతున్నారు. ఇందులో అత్యధికంగా శాసనసభ్యులే ఉన్నారు. రాజ్‌భవన్ నుంచి 19 మంది, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి 23 మంది హాజరవుతుండగా ఇద్దరు మాజీ గవర్నర్లు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితతో కలిపి 13 మంది న్యాయమూర్తులు, 14 మంది సలహాదారులు, ప్రత్యేక ప్రతినిధులు, 58 మంది వివిధ కార్పొరేషన్ల చైర్‌పర్సన్లు, 15 మంది లోక్‌సభ సభ్యులు, తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులు, 120 మంది ఎమ్మెల్యేలు, 33 మంది ఎంఎల్‌సిలు, 32 మంది ఐఏఎస్ అధికారులు, 44 మంది ఐపిఎస్ అధికారులు, నలుగురు ఐఎఫ్‌ఎస్ అధికారులు, మేయర్, డిప్యూటీ మేయర్లు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్, అడ్వొకేట్ జనరల్, శాసనసభ ప్రతిపక్ష నాయకుడు, ఇలా మొత్తం 481 మంది ఆహ్వానితులు మంత్రివర్గ విస్తరణకు హాజరవుతున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: