హరీష్ పరిస్థితి ఏంటి..? కేసీఆర్ వ్యూహం ఏంటి..?

Google+ Pinterest LinkedIn Tumblr +

కేసీఆర్ ఎన్నికైన 60 రోజుల తరువాత నేడు కేబినెట్‌ విస్తారణ చేశారు. తన కేబినెట్ లో 10 మంది ఎమ్మెల్యే లకి మంత్రి పధవులని అప్పగించారు. మరో 6 పధవులని లోక్సభ ఎన్నికల తరువాత ప్రక్టించనున్నారని తెలుస్తుంది. అయితే మునుపు మంత్రులుగా పని చేసిన వారిలో ఈసారి కేవలం ముగ్గురికే పధవులు దక్కాయి. కేటీఆర్ హరీష్ రావులకి ఈ సారి పధవులు దక్కకపోవడం గమనార్హం. కేటీఆర్ ని ఇప్పటికే టి‌ఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు మరి హరీష్ పరిస్థితి ఏంటి..? కెసిఆర్ వ్యూహం ఏంటి..? అసలేం జరుగుతుంది అని జనల్లో ప్రశ్నలు వ్యక్తమవ్తున్నాయి.

కేబినెట్‌లో కేటీఆర్ కు చోటు దక్కితే హరీష్ రావుకు కూడ చోటు కల్పించనున్నారు. కేటీఆర్ కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేసీఆర్ బాధ్యతలను అప్పగించారు. కానీ, హరీష్ రావుకు పార్టీలో ఎలాంటి పదవులు లేవు. ఇవాళ కేబినెట్‌లో కూడ హరీష్‌కు చోటు లేకుండా పోయింది.

పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లేందుకు వీలుగా కేటీఆర్ కు ముఖ్యమంత్రి పగ్గాలను అప్పగిస్తారనే ప్రచారం కూడ జరుగుతుంది. కేటీఆర్ సీఎంగా ఉంటే ఆ కేబినెట్ లో తాను మంత్రిగా పనిచేసేందుకు కూడ సిద్దమేనని హరీష్ రావు గతంలో ప్రకటించారు.

ఇదిలా ఉంటే మరో వైపు హరీష్‌ను వ్యూహత్మకంగా తప్పించే క్రమంలోనే కేబినెట్‌కు దూరంగా పెట్టారా అని ఆయన అనుచరులు కూడ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హరీష్‌రావు బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నారని కేబినెట్ విస్తరణకు ఒక్క రోజు ముందే రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: