సంక్షేమ పథకాలన్నీ పూర్తి మెజార్టీ తెస్తాయి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మళ్ళీ మనమే గెలుస్తామాని, రాష్ర్టంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న విప్లవాత్మక సంక్షేమ పథకాలన్నీ తిరిగి రెండోసారి కూడా నవ్వ్యంద్రలో తెలుగుదేశంపార్టీనే అధికారంలోకి తెస్తుందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేసారు. మంగళవారంనాడు కొండపల్లిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మైలవరం నియోజకవర్గ సమన్వయకమిటీ మరియు ఏరియా కోఆర్డినేటర్ల సమావేసం నిర్వహించారు.

దాదాపు రెండుగంటలు జరిగిన ఈ సమావేసంలో మైలవరం నియోజకవర్గంలో ఐదేళ్ళ కాలంలో చేసిన ప్రగతి పనులను మంత్రి ఉమా గణాంకాలతో వివరించారు. గ్రామాల వారీగా, మండలాల వారీగా, ప్రాంతాల వారీగా ఏఏ ఏరియాల్లో ఏ ఏ అభివృద్ధి పనులను చేపట్టిందీ వివరించి చెప్పారు. చెప్పిన పనులనే కాకుండా చెప్పని పనులను కూడా ఏవేవి చేసారో వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలనీ నూటికి నూరుశాతం మైలవరం నియోజకవర్గంలో అమలు జరిగినట్లు తెలిపారు. సీసీ రోడ్లు, పక్కా డ్రైన్లు, ఇంటింటికీ కుళాయి, ముఖ్యమంత్రి సహాయ నిధి, చంద్రన్న భీమా, పింఛన్లు, ఇళ్ళు, ఇల్ళ స్థలాలు, ప్రభుత్వ భవనాలు, పాఠశాలల అదనపు తరగతిగదులు, బీసీ రెసిడెన్షియల్స్ ఇలా ఒక్కొక్క అభివృద్ధి పనిని స్వయంగా మంత్రిగారే వివరించి చెప్పారు. వీటితో పాటు ఐదుకోట్లతో చేపట్టిన చింతలపూడి ఎత్తిపోతల పథకం, ఎన్ హెచ్ -30, పవిత్ర సంగమం పనులు, కొండపల్లి ఖిల్లా అభివృద్ది, పూరగుట్టలో వెయ్యి మందికి నివేశన స్థలాలు, జక్కంపూడి హౌసింగ్ కాలనీ వంటి కోట్ల రూపాయల అభివృద్ధి పనులను గూర్చి కూడా ఆయన వివరించారు. ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త చేసిన పనులను, చేస్తున్న పనులను ప్రజలకు వివరించి చెప్పాలని తెలిపారు. చేయాల్సిన పనులుంటే వాటిని రికార్డు చేసి సత్వర పరిష్కార దిశగా పనులు చేయాలని పేర్కొన్నారు.

ఇంటింటికీ వెళ్లి మరీ ప్రభుత్వ పనితీరును వివరించాల్సిన బాధ్యత ఉందని ఉద్ఘాటించారు. రాష్ర్ట ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తెదేపా ప్రభుత్వానికి శ్రీరామ రక్షలని పేర్కొన్నారు. రాష్ర్టం ఉన్న ఆర్థిక లోటు ఉన్నా, ఎన్నో సంక్షేమ పథకాలను కోట్ల రూపాయలలో అమలు చేయటాన్ని ప్రజలు గుర్తించారని ఆయన వివరించారు. పెంచిన పింఛన్లు, పసుపు కుంకుమ, అన్నదాత సుఘీభవ వంటి పథకాల అమలు తెలుగుదేశం పార్టీ గెలుపుకు సోపానాలుగా నిలుస్తాయని మంత్రి ఉమా అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోతే రాష్ర్టంలో అభివృద్ధి మరో 20ఏళ్లు వెనుకబడిపోతుందని, సీమాంద్ర ప్రజల కలలు కల్లలుగా మిగులుతాయని ఆయన గుర్తు చేసారు. ప్రతిపక్ష వైకాపా పార్టీ కుట్రలను, అబద్దపు ప్రచారాలను భస్మీపటలం చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైనికుల్లా ముందుకెళ్లాలని ఆయన పేర్కొన్నారు. దేశం పార్టీ కార్యకర్తలు లేకుండా తెలుగుదేశం పార్టీ లేదని, అన్ని వేళలా తెదేపాకు అండదండలు వారేనని ఆయన పదే పదే కార్యకర్తల పనితీరును ప్రసంశించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: