మద్యం మత్తునిస్తుంది.. ప్రాణం తీస్తుంది..

Google+ Pinterest LinkedIn Tumblr +

మద్యం మత్తునిస్తుంది.. ప్రాణం తీస్తుంది అంటే ఇదేనేమో.. మద్యానికి బానిసైన వారు మత్తులో మతిస్థిమితం కోల్పోయి వింతగా ప్రవర్తిస్తుంటారు ఒక్కోసారి అవి తీవ్రంగా మారుతాయి. వారికి సమయానికి మధ్యం దొరకకపోతే అంతే.. ప్రాణాలకి సైతం తెగిస్తారు, ప్రాణాలు కూడా తీస్తారు. ఇలాంటిదే ఒక విషాదం హైదరాబాద్‌లో జరిగింది.

మద్యం తాగేందుకు భార్య డబ్బులివ్వలేదని భర్త ఒంటికి నిప్పటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే… ముత్వెల్లిగూడ గ్రామానికి చెందిన నాగమ్మకు సత్యం తో 2003లో వివాహాం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు సంతానం.. చిన్నారులిద్దరూ 14 ఏళ్ల లోపు వారే.. సత్యం రోజు వారీ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఇతను మద్యానికి బానిస కావడంతో తరచూ తప్పతాగి ఇంటికి వచ్చేవాడు.

సంపాదించినదంతా మద్యానికి ఖర్చు చేసి.. అవి చాలకపోవడంతో డబ్బుల కోసం భార్యను వేధించేవాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం భార్యను మద్యం కోసం డబ్బులు కోసం వేధించాడు. ఆమె అందుకు ససేమిరా అనడంతో మనస్తాపానికి గురైన సత్యం దగ్గరలో ఉన్న పెట్రోల్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. నాగమ్మ మంటలను అర్పేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే ఆలస్యం కావడంతో తీవ్రగాయాలతో అతను ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: