శ్రీ రెడ్డి ఇన్ ‘లక్షీస్ వీరగ్రంధం’..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బయోపిక్ లు ట్రెండ్ గా మారాయి. మొన్నటివరకు మహానటి, కథానాయకూడ, యాత్ర అంటూ బయోపిక్ లు రిలీజ్ అయ్యాయి. ఇక పోతే ఎన్‌టి‌ఆర్ జీవితం ఆధారంగా ఒకటి కాదు రెండు కాదు మొత్తం 4 బయోపిక్ లు వస్తున్నాయి. అందులో ఒకటి ఇప్పటికే రిలీజ్ అయ్యిన విషయం తెలిసిందే. యూట్యూబ్ లో ఈ బయోపిక్ ల ట్రైలర్లు హల్చల్ చేస్తున్నాయి మేము అంటే మేము అనట్టుగా రిలీజ్ చేస్తున్నారు.

వీటితో పాటు రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద మూవీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్‌తో అంచనాలు పెంచేసి విడుదలకు రెడీ అయ్యింది. ఈ మూవీ ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీ పార్వతి ఎంటర్ అయిన తరువాత జరిగిన పరిణామాలను నాటి వాస్తవ పరిస్థితుల్ని చూపించబోతున్నారు వర్మ.

ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి పోటీగా లక్ష్మీ పార్వతిని నెగిటివ్‌గా చూపిస్తూ.. ‘లక్షీస్ వీరగ్రంధం’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి. నాగరుషి ఫిలిమ్స్ బ్యానర్‌లో సిరిపురపు విజయ భాస్కర్ రెడ్డి సమర్పణలో ఈ చిత్రం రూపొందనుంది. అయితే ఈ మూవీలో లక్ష్మీ పార్వతి పాత్రను వివాదాస్పద నటి శ్రీ రెడ్డి నటించబోతుందంటూ బాంబ్ పేల్చేరు దర్శకుడు కేతిరెడ్డి. మొన్నటి వరకూ ఈ పాత్రలో సీనియర్ నటి నటించబోతుందంటూ ప్రచారం చేసిన దర్శకుడు చివర్లో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇక శ్రీ రెడ్డిని పెట్టడం తో ఈ సినిమాకి అంచనాలు పెరిగిపోవటం తప్పనిసరి.

Share.

Comments are closed.

%d bloggers like this: