పిచ్చిపిచ్చిగా చూపిస్తే.. కోర్టుకెక్కుతా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

వెన్నుపోటు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇదే వైరల్ కంటెంట్. ఎక్కడ చూసిన ఇదే మాట వినిపిస్తుంది ఎందుకంటే ట్రైలర్ల ప్రభావం అనే చెప్పాలి. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్లు చూస్తే ఎవ్వరికైన ఇదే మాట వస్తుంది. ఎన్‌టి‌ఆర్ జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రాల ట్రైలర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పోటాపోటిగా వరుస ట్రైలర్లు చూసి జానాలు తికమక పడిపోతున్నారు. అయితే ఒక ట్రైలర్ లో బాబు విలన్ అయితే మరో ట్రైలర్ లో నాదెండ్ల విలన్ అని తెలిసిపోతుంది.

ఆయితే దీనికి స్పందిస్తూ ఒక ఇంటర్వ్యూ లో ‘ఎన్టీఆరే తనను వెన్నుపోటు పొడిచారని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు ఆరోపించారు. బాలకృష్ణ తీసిన మహా నాయకుడు సినిమాను చూసి ఎవరు విలనో తేల్చాలని ఆయన ప్రజలను కోరారు. బాలకృష్ణ నటించి నిర్మించిన మహానాయకుడు విడుదలౌతున్న సందర్భంగా ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు నాదెండ్ల భాస్కర్ రావు బుధవారం నాడు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను వెల్లడించారు. సినిమా అంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా చూపి ప్రజలను మభ్య పెట్టి ప్రజల నుండి డబ్బులను వసూలు చేయటం అని నాదెండ్ల భాస్కర్ రావు అభిప్రాయపడ్డారు.

ఈ సినిమాలో తనను అవమానకరంగా చూపితే చర్యలు తీసుకొంటామని ఇప్పటికే తాము నోటీసులు ఇచ్చామన్నారు. కానీ, సెన్సార్ బోర్డు సభ్యులు తమ అభిప్రాయాలను కూడ పట్టించుకోలేదన్నారు. లేనిది ఉన్నట్టుగా చూపితే ఆయన కోర్టుకి ఎక్కుతానన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: