అక్క ఆకర్షిస్తుంది.. తమ్ముడు అంతం చేస్తాడు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

డబ్బు దొరకకపోతే మనుషులు దేనికైయన సిద్దపడతారు. దొంగ తనాలు చేస్తారు ఆకరి హత్యలకి కూడా పాల్పడతారు. కష్టపడి ఉద్యోగం చేయకుండా కష్టపడి హత్యలు చేస్తూ చట్టాన్ని అతిక్రమించి డబ్బు సంపాదించాలనుకుంటారు. ఇలాంటి ఒక సంఘటనే ఢిల్లీ లోని బక్తార్‌పూర్‌ లో చోటు చేసుకుంది. రెండు రోజుల్లో రెండు హత్యలకి పాల్పడ్డారు. అసలు ఎవరా ఈ హత్యలు చేసిందీ.. అని పోలీసులు ఆరా తీస్తే ఒక అక్క తమ్ముడు అని విచారణలో తీలింది.

కథలోకి వెళితే.. డబ్బు కోసం హంతకులుగా మారారు ఓ అక్కాతమ్ముళ్లు. ఎవరూ ఊహించని విధంగా రెండు మర్డర్లు చేశారు. ఈ రెండు హత్య కేసులు ఒకేలా ఉండటంతో… అసలు నిందితులను పట్టుకోవడం పోలీసులకు సులువైంది. ఢిల్లీ సమీపంలోని బక్తార్‌పూర్‌కు చెందిన నీలం, శివ కుమార్ ఇద్దరు అక్కాతమ్ముళ్లు. అయితే ఇద్దరిలో ఎవరికి పని దొరక్కపోవడంతో… డబ్బు కోసం హత్యలు చేయాలని నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలో ఆటో, టాక్సీ డ్రైవర్లనే లక్ష్యంగా ఎంచుకున్నారు. ఫిబ్రవరి 12న ఓ ఆటోలో ఊరు చివర వరకు ప్రయాణించిన ఇద్దరు… అక్కడే డ్రైవర్‌ను హత్య చేసి అతడి దగ్గర ఉన్న డబ్బును దోచుకున్నారు. ఆ మరుసటి రోజే ఓ టాక్సీ డ్రైవర్ కూడా మిస్ కావడం… అతడు కూడా నగర శివార్లలో హత్యకు గురికావడంతో పోలీసులు విచారణ కొనసాగించారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. తాను వలుపుతో వల వేసి డ్రైవర్లను ఆకర్షించానని… ఆ తరువాత తాను, తన సోదరుడు కలిసి డ్రైవర్లను చంపేశామని 23 ఏళ్ల నీలం పోలీసులకు వివరించింది.

Share.

Comments are closed.

%d bloggers like this: