గేయ రచయిత వేదవ్యాస రంగభట్టర్ ఇక లేరు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

గత కొద్దిరోజులుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధ పడుతున్న సినీ గేయ రచయిత వేదవ్యాస రంగభట్టర్ వారం రోజుల నుండి స్విమ్స్ లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఆకస్మికంగా కన్నుమూశారు. ఈరోజు బైరాగిపట్టెడలోని ఆయన స్వగృహం నుండి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

సినీ గేయ రచయిత వేదవ్యాస రంగభట్టర్ 1946లో వరంగల్ జిల్లా కోమటిపల్లి అగ్రహారంలో జన్మించారు. . సినీ దర్శకుడు, రచయిత జేకే భారవి వేదవ్యాస రంగభట్టర్‌కు స్వయాన తమ్ముడు కావడం గమన్నార్హం. 1968లో టీటీడీలో ఎస్వీ ప్రాచ్య కళాశాలలో సంస్కృత అధ్యాపకులుగా పని చేశారు. సాహిత్య శాఖ అధ్యక్షుడిగా, ప్రిన్సిపాల్‌గా పనిచేశారు వృత్తి రీత్యా తిరుపతిలో స్థిరపడ్డా ప్రస్తుతం బైరాగిపట్టెడలో ఆయన నివాసముంటున్నారు.

1986లో తొలిసారి ఆయన ‘రంగవల్లి’ చిత్రానికి పాటలు రచించారు. ఆ తరువాత ‘శ్రీమంజునాథ’, ‘రామదాసు’, ‘పాండురంగడు’, ‘షిరిడీ సాయి’, ‘అనగనగా ఒక ధీరుడు’, ‘ఝుమ్మంది నాదం’, ‘ఓం నమో వెంకటేశాయ’ ఇలా దాదాపు పదమూడు చిత్రాలకు సాహిత్యం అందించారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు, రాజకీయనాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: