సాహో సమీపం లో సౌత్ స్టార్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

బాహుబలి తరువాత ప్రభాస్ పై బారి అంచనాలున్నాయి.. సాధారణంగా అంతటి హిట్ కొట్టిన తరువాత అభిమానులకి అంచనాలు పెరిగిపోతాయి. అయితే అభిమానుల అంచనాలని అందుకునే దిశగా ప్రభాస్ ప్రయత్నిస్తున్నాడు. దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న సినిమా సాహో లో ఆయన నటిస్తున్న విషయం తెలిసిందే. భారి బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాని తెలుగు లోనే కాకుండా హింది మరియు వేరే బాషల్లో చిత్రీకరిస్తున్నారు. అయితే హిందీ ప్రేక్షకులని కూడా ఆకట్టుకోడానికి ఈ సినిమాలో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ని నియమించారు.

బాహుబలి లాంటి భారీ విజయం తరువాత ప్రభాస్‌ స్టేటస్ కి తగ్గట్టు మరోసారి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా చాలా రోజులుగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ప్రస్తుతం చివరి దశ షూటింగ్‌లో ఉన్న సాహో టీంకు ఓ సౌత్‌ స్టార్‌ హీరో అజిత్ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడట. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో సాహో షూటింగ్ జరుగుతుండగా తమిళ స్టార్ హీరో అజిత్‌ సెట్‌కు వచ్చి ప్రభాస్‌ను సర్‌ప్రైజ్‌ చేసినట్టుగా తెలుస్తోంది.

ప్రస్తుతం అజిత్ రామోజీ ఫిలిం సిటీలో పింక్‌ రీమేక్‌ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. పక్కనే సాహో షూటింగ్ జరుగుతుండటంతో విరామ సమయంలో కాసేపు సాహో యూనిట్‌ తో గడిపారు. అజిత్‌ను సెట్‌లోకి ఆహ్వానించిన ప్రభాస్‌ కొద్ది సేపు షూటింగ్‌కు బ్రేక్‌ ఇచ్చి అజిత్‌తో మాట్లాడాడట. ఈ సంఘటనకు సంబంధించిన వార్తలు టాలీవుడ్‌ లో హల్‌చల్‌ చేస్తున్నాయి అందుకు సంబంధించిన ఫోటోలు మాత్రం బయటకు రాకుండా చిత్రయూనిట్ జాగ్రత్తలు తీసుకన్నట్టుగా తెలుస్తోంది.

Share.

Comments are closed.

%d bloggers like this: